కరోనా వల్ల ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయి బతుకు బండిని ఈడుస్తుంటే కొందరు అప్పటికే నిండా కష్టాలతో జీవనం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారిలో ఆ మహిళ కూడా ఒకరు. ఆమె పీజీ చదివింది. అయినప్పటికీ విధివశాత్తూ స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించింది. కానీ మంత్రి కేటీఆర్ చొరవతో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లాకు చెందిన రజని అనే మహిళ 2013లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది. పీజీలో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయింది. అయితే ఆమెకు హెచ్‌సీయూలో పీహెచ్‌డీ చేసేందుకు ఆఫర్ వచ్చింది. కానీ ఆమెకు వివాహం అవడంతో పీహెచ్‌డీ చేయలేదు. ఆమె భర్త అడ్వకేట్. కానీ ఆయనకు గుండె జబ్బు రావడంతో మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో కుటుంబ పోషణ భారం రజనిపై పడింది. ఈ క్రమంలోనే ఆమె మొదట్లో తోపుడు బండిపై కూరగాయలు అమ్మేది.
అయితే తరువాత ఆమె జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో స్వీపర్‌గా చేరింది. నెలకు రూ.10వేలు వచ్చేవి. కానీ అవి ఆమెకు ఏమాత్రం సరిపోయేవి కావు. దీంతో ఆమె దుర్భరమైన జీవితాన్ని గడుపుతోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్వయంగా ఆమెను తన కార్యాలయానికి పిలిపించుకుని ఆమెకు జీహెచ్ఎంసీలోనే ఉన్నత స్థాయిలో ఉద్యోగం ఇచ్చారు. ఆమెను ఎంటమాలజీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్‌గా నియమించారు. దీంతో ఆమె మంత్రి ఎదుట భావోద్వేగానికి గురైంది. తన కష్టాలు తెలుసుకుని తనకు ఈ జాబ్ ఇప్పించినందుకు ఆమె మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…