మే 7 (శుక్రవారం), 2021న మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం – ఈ రోజు ఈ రాశి వారు తమ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు చాలా దృఢంగా ఉండేందుకు అవకాశం ఉంది. సున్నితమైన విషయాలను చర్చించకపోవడమే మంచిది.
వృషభం – రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్న వారు ఈ రోజు తమ ప్రణాళికలను ఆచరణలో పెట్టేందుకు అవకాశం ఉంది. తమ భవిష్యత్తు కోసం వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు.
మిథునం – ఈ రాశి వారు ఈ రోజు చాలా గొప్ప కార్యక్రమాల్లో పాల్గొంటారు. శక్తివంతులతో, కొత్త వారితో గొప్ప అనుబంధాలను పెంచుకుంటారు.
కర్కాటకం – ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎలాంటి వాదనలు, వాగ్వివాదాలు చేయరాదు. మాటలు అనే ముందు ఒకసారి ముందు, వెనుక ఆలోచించాలి. లేదంటే ఇబ్బందుల్లో పడిపోతారు.
సింహం – వీరు ఈ రోజు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ధ్యానం, యోగా వంటి రిలాక్సేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య – ఉద్యోగులు ఈ రోజు పని మీద, ఆఫీసు కార్యకలాపాల కోసం ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్లినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడాలి.
తుల – వీరు ఎవరి నుంచి అయినా వచ్చే విమర్శలను ఎదుర్కోలేరు. ఎవరైనా దగ్గరి వారితో తమ సమస్యలను చర్చిస్తే మంచిది.
వృశ్చికం – జీవిత భాగస్వాముల నుంచి వీరికి ఈ రోజు సంపూర్ణ మద్దతు, సహకారం లభిస్తాయి. వ్యాపారంలోనూ భాగస్వాముల నుంచి సహకారం ఉంటుంది. వీరికి అన్ని విధాలుగా సపోర్ట్ లభించి ఉత్సాహంగా ఉంటారు.
ధనుస్సు – వీరు ఆఫీసు పనుల్లో ఈ రోజు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే అన్నింటినీ ప్రణాళిక ప్రకారం చేస్తే ఒత్తిడి నుంచి బయట పడవచ్చు.
మకరం – గతంలో వీరు చేసిన శ్రమకు, పడిన కష్టాలకు ఈ రోజు ఫలితం లభిస్తుంది. సుదీర్ఘకాలంగా ఉండే పేమెంట్లు క్లియర్ అయ్యే అవకాశం ఉంది.
కుంభం – తమ జీవిత భాగస్వామి నుంచి వీరికి ఈ రోజు సర్‌ప్రైజ్ అందుతుంది. ఉత్సాహంగా గడుపుతారు. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు.
మీనం – ఈ రాశి వారు తమకు అత్యంత దగ్గరగా ఉండే స్నేహితులతో కొన్ని రహస్యాలను పంచుకుంటారు. ప్రకృతిలో గడుపుతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…