ఆరోగ్యం

Ear Wax : చెవుల్లో ఏర్ప‌డే గులిమి స్థితిని బ‌ట్టి వ్య‌క్తి ఆరోగ్య స్థితి తెలుసుకోవ‌చ్చిలా..!

Ear Wax : చెవుల్లో ఏర్ప‌డే వ్య‌ర్ధ ప‌దార్థం గురించి అంద‌రికీ తెలిసిందే. అదేనండీ.. గులిమి. చెవుల్లో అది ఉన్నా లేకున్నా చాలా మంది అస్త‌మానం చెవిలో ఏదో ఒక‌టి పెట్టి తిప్పుతుంటారు. ఇంకా కొంద‌రు అయితే చెవుల్లో అసలు గులిమినే క్లీన్ చేసుకోరు. స‌రే ఈ విష‌యంలో ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా ప్ర‌వ‌ర్తిస్తారు. కానీ చెవుల్లో ఏర్ప‌డే గులిమి స్థితిని బ‌ట్టి కూడా ఎవ‌రు ఎలాంటి అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ట‌. అవును, మేం చెబుతోంది నిజ‌మే. అయితే గులిమి ఎలా ఉంటే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చెవిలో ఉండే గులిమి వ‌ల్ల అస్త‌మానం దుర‌ద పెడుతూ ఉంటే అప్పుడు అలాంటి వ్య‌క్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోకింద‌ని అర్థం చేసుకోవాలి. వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి త‌గిన చికిత్స తీసుకోవాలి.

వ‌య‌స్సు పెరుగుతున్న కొద్దీ చెవిలో ఉండే గులిమి కూడా రంగు మారుతుంది. స్థితి కోల్పోతుంది. అయితే యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా గులిమి న‌ల్ల‌గా, పొడిగా ఉంటే అప్పుడు అనుమానించాల్సిందే. వెంట‌నే వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం బెట‌ర్‌. ఏదైనా ప‌నిచేసిన‌ప్పుడు, వ్యాయామం చేసిన‌ప్పుడు చెమ‌ట రావ‌డం స‌హ‌జ‌మే. అయితే చెవుల్లో ఉండే గులిమి చెమ‌ట రూపంలో వ‌స్తుంటే అప్పుడు దాన్ని తీవ్రమైన స‌మ‌స్య‌గా భావించాలి. వెంట‌నే డాక్టర్‌ను క‌లిసి త‌గిన చికిత్స తీసుకోవాలి. అది తీవ్ర‌మైన చెవి సంబంధ స‌మ‌స్య అయి ఉండ‌వ‌చ్చు. క‌నుక అలా గ‌న‌క ఉంటే నిర్ల‌క్ష్యం చేయ‌రాదు.

Ear Wax

చెవుల్లో ఏర్ప‌డే గులిమి ఆరెంజ్ లేదా డార్క్ బ్రౌన్ రంగులో ఉంటుంది. అయితే ఈ రెండు క‌ల‌ర్లు కాకుండా గులిమి ఆకుప‌చ్చ‌, ప‌సుపు, న‌లుపు, తెలుపు రంగుల్లో ఉంటే అప్పుడు చెవికి ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్టు అర్థం చేసుకోవాలి. వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వాలి. త‌గిన వైద్యం పొందాలి. గులిమి అంతా క‌ల‌సి పోయి ఉండ‌కుండా పొట్టులా ఉంటే అప్పుడు చెవి దుర‌ద స‌మ‌స్య వ‌చ్చిన‌ట్టు తెలుసుకోవాలి. త‌గిన స‌మ‌యంలో స్పందించి చికిత్స తీసుకోవాలి.

గులిమి దుర్వాస‌న వ‌స్తుంటే చెవి ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చిన‌ట్టు తెలుసుకోవాలి. వెంట‌నే త‌గిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సాధార‌ణంగా ఎవ‌రికైనా చెవిలో గులిమి ఏర్ప‌డుతుంది. ఒక వేళ అలా కాక గులిమి ఏర్ప‌డ‌క‌పోతే ప్ర‌మాద‌మే. డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల్సిందే.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM