Flies : వానా కాలంలో అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వానా కాలంలో దోమలు, ఈగలు కూడా విపరీతంగా ఇంట్లోకి చేరుతూ ఉంటాయి. ఈగల వలన ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఈగల వలన రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఈగల వలన కలరా, విరేచనాలు, టైఫాయిడ్, అతిసారం, డెంగ్యూ ఇలాంటి చాలా సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. శుభ్రత లేకపోతే ఈగలు ఇంట్లోకి వస్తాయి. చాలామంది ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోరు. అలాంటప్పుడు ఈగలు ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది.
కొన్ని కొన్ని సార్లు బాగా శుభ్రం చేసినా కూడా ఇంట్లోకి ఈగలు వచ్చేస్తూ ఉంటాయి. ఈగల బాధనుండి మీరు బయటపడాలంటే ఇలా చేయండి. ఇక ఈగలు మీ ఇంట్లోకి రావు. అల్ట్రా వయోలెట్ ట్రాప్స్ ని ఉపయోగించడం ద్వారా ఈగలు ఇంట్లో ఇబ్బంది పెట్టవు. ఇంట్లో ఈ అల్ట్రా వయోలెట్ ట్రాప్ ని పెడితే అది ఈగల్ని బాగా ఆకర్షిస్తుంది. అలా వాటి వద్దకు వెళ్లిన ఈగలు షాక్ తో చనిపోతాయి. ఇలా ఈగలని తగ్గించుకోవచ్చు.
కర్పూరం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ వాసనతో ఈగలు రాకుండా చేయొచ్చు. ఈగలు ఎక్కువగా ఉంటే కర్పూరంని వెలిగించండి. ఈగలు అప్పుడు చేరవు. తులసి కూడా చక్కగా పనిచేస్తుంది. తులసిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తులసికి ఈగలను తరిమికొట్టే శక్తి కూడా ఉంది. తులసి ఆకులని, పుదీనా, లావెండర్ ఆకుల్ని కూడా మీరు ఉపయోగించవచ్చు.
డిష్ వాషింగ్ లిక్విడ్ తోపాటు కొంచెం వైట్ వైన్ కలుపుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకుని,ఇంట్లో పెట్టడం వలన ఈగలు ఆకర్షించి అందులో పడి చనిపోతాయి. ఈగలు రాకుండా ఉండడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా సహాయం చేస్తుంది. ఇంట్లో ఎక్కడైనా ఆపిల్ సైడర్ వెనిగర్ ని పెట్టండి. ఆ వాసనకి అసలు ఈగలు రావు. దాల్చిన చెక్క పొడి కూడా ఈగలను రాకుండా చేస్తుంది. ఈ వాసనని అసలు ఈగలు ఇష్టపడవు. దాంతో ఈగలు రాకుండా ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…