Sleep : మనిషి నిత్యం పౌష్టికాహారం తీసుకోవడం, సరైన ఆహారపు అలవాట్లు పాటించడం, వేళకు భోజనం చేయడం, వ్యాయామం చేయడం ఎంత అవసరమో రోజూ తగినన్ని గంటలు నిద్ర పోవడం కూడా అంతే అవసరం. సాధారణంగా ప్రతి వ్యక్తి రోజూ కనీసం 6 నుంచి 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లలకైతే ఆ సమయం ఇంకా పెరుగుతుంది. వారు రోజుకు 10 గంటల పాటు నిద్రపోవాలి. అయితే నేటి ఆధునిక యుగంలో నిత్యం ఒత్తిళ్లు, అనారోగ్యాలతో సావాసం చేస్తున్న మనం నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. ఈ క్రమంలో రోజుకు కనీసం తక్కువలో తక్కువ 6 గంటల పాటైనా నిద్రపోకపోతే కలిగే దుష్ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్యం కనీసం 6 గంటల పాటైనా నిద్రపోకపోతే శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. దీంతో శక్తి ఖర్చు కావడం తగ్గుతుంది. ఇది మెటబాలిజంపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ వంటి సమస్యలు తలెత్తేలా చేస్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరేలా చేస్తుంది. ఏకాగ్రత నశిస్తుంది. దేనిపై కూడా సరిగ్గా దృష్టి పెట్టలేం. ప్రధానంగా వాహనాలు నడుపుతున్నప్పుడు ఏకాగ్రత లోపించడం వల్ల ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. సరిగ్గా నిద్రపోక పోతే శరీరానికి సోమరితనం అలవాటు అవుతుంది. రోజూ మజ్జుగా మబ్బుగా ఉంటారు. ఉత్సాహంగా ఉండరు. బద్దకంగా ఉంటుంది. కొందరికైతే మద్యం సేవించినట్టు మత్తుగా ఉంటుంది.
నిద్ర సరిగ్గా పోకపోతే అది మెదడుపై డైరెక్ట్‌గా ప్రభావం చూపుతుంది. దీంతో మెదడు పనితనం నెమ్మదిస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏదీ సరిగ్గా గుర్తు పెట్టుకోలేరు. రోజుకు తగినన్ని గంటల పాటు నిద్రపోని పురుషుల్లో వీర్యం ఉత్పాదకత తగ్గుతుంది. ఫలితంగా పిల్లలు త్వరగా పుట్టరు. డిప్రెషన్ దరి చేరుతుంది. ఎంత సేపూ ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. సంతోషం అనేది దూరమవుతుంది.
స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక శక్తి తగ్గుతుంది. ఆ కార్యంపై అస్సలు మనస్కరించదు. పూర్తిగా అయిష్టత ఏర్పడుతుంది. వయస్సు తక్కువగా ఉన్నా త్వరగా చర్మం ముడతలు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయి. కనుక నిత్యం తగినంతగా నిద్ర పోవడం కచ్చితంగా అవసరమే. పైన చెప్పిన విషయాలన్నింటినీ పలువురు సైంటిస్టులు పరిశోధించి నిరూపించారు కూడా. కనుక నిద్ర పట్ల అస్సలు నిర్లక్ష్యం వహించకండి. కనీసం 6 గంటల పాటు అయినా సరే నిద్రించండి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…