హార్ట్ ఎటాక్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చి కుప్ప కూలిపోతుంటారు. దీంతో ప్రాణాపాయ స్థితి సంభవిస్తుంది. అయితే హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని తెలుసుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్ ను ముందే గుర్తించవచ్చు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
1. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఛాతిలో అసౌకర్యంగా ఉంటుంది. గుండెల మీద బరువు పెట్టినట్లు అనిపిస్తుంది. గ్యాస్ వల్ల వచ్చే నొప్పి అయితే అప్పటికప్పుడు తగ్గుతుంది. కానీ హార్ట్ ఎటాక్ నొప్పి అయితే వెంటనే తగ్గదు. ఛాతి మీద బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా తేడాను గుర్తించవచ్చు.
2. హార్ట్ ఎటాక్ అనేది రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల వస్తుంది. అయితే ఈ విధంగా జరిగినప్పుడు చేతులు, వెన్నెముక, మెడ, దవడలు, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ఆయా భాగాల్లో నొప్పిగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌లో చేరి పరీక్షలు చేయించుకోవాలి.
3. నిద్ర నుంచి లేవగానే కొందరికి చెమటలు పడుతుంటాయి. అలాగే కొందరికి వికారంగా, వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇవి హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలే. ఇవి గనక కనిపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే కొందరికి ఈ లక్షణాలతోపాటు దగ్గు, జలుబు కూడా నిరంతరాయంగా వస్తుంటాయి. కనుక ఈ లక్షణాలను కూడా గమనించాలి.
4. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో ఒకటి.. శ్వాస సరిగ్గా ఆడకపోవడం. రోజువారీగా చేసే పనులు యథావిధిగా చేస్తున్నా అలసటగా అనిపించడం, మెట్లు ఎక్కడం, కొంత దూరం నడిచినా ఆయాసం రావడం.. వంటివి హార్ఠ్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే సంకేతాలే. ఇవి కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే చికిత్స తీసుకోవడం మంచిది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…