Walnuts Health Benefits : చాలామంది, ఈ మధ్యకాలంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో, చాలామంది మోకాళ్ల నొప్పులు, పాదాల వాపులతో బాధపడుతున్నారు. మోకాళ్ళ నొప్పులు, పాదాల వాపులతో మీరు కూడా బాధపడుతున్నారా..? ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే, ఇలా చేయడం మంచిది. ఇలా చేస్తే, ఈజీగా మోకాళ్ళ నొప్పులు, పాదాల వాపులు తగ్గిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా, పోషకాహారం తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారాన్ని తీసుకుంటే, చాలా రకాల సమస్యలకి దూరంగా ఉండవచ్చు.
ఎక్కువ మంది, ఈరోజుల్లో పండ్లు, డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకుంటున్నారు. డ్రై ఫ్రూట్స్ ధర ఎక్కువైనా కూడా ఆరోగ్య ప్రయోజనాలను ఎన్నో అందిస్తాయి. వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాల్నట్స్ ని తీసుకోవడం వలన, చర్మ సంరక్షణతో పాటుగా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వాల్ నట్స్ లో విటమిన్ ఈ, బీ సిక్స్ తో పాటుగా ఫాస్ఫరస్ వంటివి కూడా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి ఇది కీలకపాత్ర పోషిస్తుంది. వాల్నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఒత్తిడికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో కూడా వాల్నట్స్ పోరాటం చేయగలవు. వృద్ధాప్య ఛాయాలని కూడా ఆలస్యం చేస్తాయి. చర్మం యవ్వనంగా, ముడతలు లేకుండా కాంతివంతంగా ఉండడానికి వాల్నట్స్ బాగా ఉపయోగపడతాయి. మిక్సీ జార్లో నాలుగు వాల్నట్స్ ని, రెండు చెంచాల ఓట్స్, ఒక స్పూన్ తేనె, నాలుగు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ లాగా చేసుకోండి.
ముఖానికి ఈ పేస్ట్ ని పట్టించి, పది నిమిషాలు పాటు వదిలేసి, శుభ్రం చేసుకుంటే నల్లని మచ్చలు ఈజీగా తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. వాల్నట్స్ ని తీసుకోవడం వలన ఆకలి బాగా తగ్గుతుంది. వాల్నట్స్ ని తీసుకుంటే, ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ కడుపుని నింపేస్తాయి. అధిక బరువు సమస్యకి కూడా దూరంగా ఉండవచ్చు.