ఆరోగ్యం

Yellow Nails : మీ గోర్లు ప‌సుపు రంగులోకి మారాయా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

Yellow Nails : చాలా మంది గోర్ల‌ను ఆక‌ర్ష‌ణీయ‌త కోసం పెంచుకుంటారు. కొంద‌రైతే గోర్లు పెరుగుతున్నా వాటిని ప‌ట్టించుకోరు. కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోక‌పోతే మ‌న‌కు వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. గోర్ల‌ను పెంచుకున్నా, పెంచుకోక‌పోయినా వాటిని ఎప్ప‌టి క‌ప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ క్ర‌మంలో అలా శుభ్రం చేసుకోక‌పోయినా, లేదంటే ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్‌, విట‌మిన్ లోపం, పొగ తాగ‌డం, డ‌యాబెటిస్‌, లివ‌ర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఉన్న వారి గోర్లు ప‌సుపు రంగులోకి మారిపోతాయి. ఒక వేళ మీకు గ‌న‌క అలా మారి ఉంటే వెంట‌నే స్పందించండి. అలాంటి వారు కింది టిప్స్‌ను పాటిస్తే గోర్ల‌ను ప‌సుపు రంగు నుంచి సాధార‌ణ స్థితికి మార్చుకోవ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గోర్ల‌కు ఎవ‌రైనా నెయిల్ పెయింట్ వేసుకున్న‌ట్టయితే వెంట‌నే దాన్ని తీసేయాలి. గోర్లకు ఎలాంటి ప‌దార్థాలు లేన‌ప్పుడే వాటి అస‌లు రంగు తెలుస్తుంది. దీంతో ఆ రంగును తొల‌గించుకునేందుకు వీలుంటుంది. కాబ‌ట్టి నెయిల్ పాలిష్ రిమూవ‌ర్‌తో పెయింట్‌ను తీసేయండి. అనంత‌రం కింది టిప్స్‌ను పాటించండి. చిన్న గిన్నెలో కొద్దిగా నిమ్మ‌ర‌సం తీసుకుని అందులో గోళ్ల‌ను పూర్తిగా ముంచాలి. అలా 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండాలి. అనంత‌రం గోర్ల‌ను బ‌య‌ట‌కు తీయాలి. ఇప్పుడు ఒక టూత్‌బ్ర‌ష్ స‌హాయంతో అదే నిమ్మ‌రసాన్ని ఉప‌యోగించి గోర్ల‌ను శుభ్రంగా రుద్దాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో గోర్ల‌ను క‌డిగేయాలి. త‌రువాత గోర్ల‌కు మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు నిత్యం చేస్తూ ఉంటే ప‌సుపు రంగు గోర్లు సాధార‌ణ స్థితికి వ‌స్తాయి.

Yellow Nails

అయితే నిమ్మ‌ర‌సం లేకుంటే లెమ‌న్ ఎసెన్షియ‌ల్ ఆయిల్‌ను కూడా నీటిలో క‌లుపుకుని పైన చెప్పిన విధంగా వాడుకోవ‌చ్చు. లేదంటే ఒక నిమ్మ‌కాయ‌ను తీసుకుని రెండు ముక్క‌లుగా క‌ట్ చేసి ఒక్కో ముక్క‌ను 10 నిమిషాల పాటు గోర్ల‌పై రాయాలి. అనంత‌రం క‌డిగేయాలి. ఇలా చేసినా గోర్లు సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తాయి. టూత్‌పేస్ట్‌ను కొద్దిగా తీసుకుని గోర్ల‌కు బాగా రాయాలి. అనంత‌రం ఆ గోర్ల‌ను టూత్ బ్ర‌ష్ సహాయంతో రుద్దాలి. ఇలా ఒక్కో గోరును చేయాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. త‌రువాత మాయిశ్చ‌రైజ‌ర్ రాయాలి. ఇలా చేసినా గోర్ల సాధార‌ణ రంగును తిరిగి పొంద‌వ‌చ్చు.

3 టేబుల్ స్పూన్ల హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌ను తీసుకుని కొద్దిగా గోరు వెచ్చ‌ని నీటిలో క‌ల‌పాలి. అనంత‌రం ఆ నీటిలో గోర్ల‌ను ముంచి 10 నిమిషాల పాటు ఉండాలి. గోర్ల‌ను తీసి అదే మిశ్ర‌మంతో టూత్‌బ్ర‌ష్‌ను ఉప‌యోగించి గోర్ల‌ను రుద్దాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో గోర్ల‌ను క‌డిగి మాయిశ్చ‌రైజ‌ర్ రాయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా ఫ‌లితం ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌, రెండున్న‌ర టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మ‌ర‌సం తీసుకుని అన్నింటినీ బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని టూత్‌బ్ర‌ష్ స‌హాయంతో గోర్ల‌కు ప‌ట్టించాలి. 2 – 3 నిమిషాల పాటు గోర్ల‌ను అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో క‌డిగేయాలి. త‌రువాత మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేయాలి. ఇలా 6 నుంచి 8 వారాల పాటు చేస్తే ఫ‌లితం క‌నిపిస్తుంది. ముందు చెప్పిన దాంట్లో హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌కు బ‌దులుగా ఆలివ్ ఆయిల్‌ను కూడా వాడ‌వ‌చ్చు.

ఒక క‌ప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ క‌లిపి ఆ మిశ్ర‌మంలో గోర్ల‌ను 20 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. అనంత‌రం గోర్ల‌కు ఆలివ్ ఆయిల్ రాసుకోవాలి. నిత్యం 3 సార్ల చొప్పున 4 వారాల పాటు ఇలా చేస్తే గోర్ల‌కు పూర్వ రంగు వ‌స్తుంది. నారింజ పండు తొక్క‌ల‌ను సేక‌రించి వాటిని ఎండ‌బెట్టి పొడి చేయాలి. ఈ పొడిని కొంత నీటికి క‌లిపి మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను టూత్ బ్ర‌ష్ స‌హాయంతో గోర్ల‌కు రాయాలి. అలా గోర్ల‌ను 10 నిమిషాల పాటు ఉంచాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఈ చిట్కాను 1 నుంచి 2 వారాల పాటు రోజూ పాటిస్తే గోర్ల‌కు ఉన్న ప‌సుపు రంగు పోతుంది. ముందు చెప్పిన దానికి బ‌దులుగా నారింజ పండు తొక్క‌నే నేరుగా తీసుకుని దాన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు గోర్ల‌కు రాస్తూ ఉన్నా గోర్ల రంగు సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తుంది.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM