Calcium : పాలు ఆరోగ్యానికి చాలా మంచివని చాలామంది పాలని తీసుకుంటూ ఉంటారు. పాలను తీసుకోవడం వలన అనేక లాభాలని పొందొచ్చు. పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అయితే, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుని మీరు వాటిని తీసుకున్నట్లయితే, ఎక్కువ కాల్షియం పొందొచ్చు. వీటిలో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుందట. మరి ఇక ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలను చూసేద్దాం.
పాలల్లో క్యాల్షియం తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. పాలు తాగడం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. దానితో పాటుగా, ఇతర లాభాలను మనం పాల ద్వారా పొందవచ్చు. అయితే, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. మరి ఇక వాటి గురించి తెలుసుకుందాం. నీళ్లు కలపని గేదె పాలల్లో చూసుకున్నట్లయితే, 220 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అదే నీళ్లు కలిపితే 120 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఆవు పాలలో 120 మిల్లి గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
అయితే, గోరుచిక్కుడు లో చూసుకున్నట్లయితే, 100 గ్రాముల గోరు చిక్కుడు లో 130 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. శనగలలో 202 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. బాదంపప్పులో చూసుకున్నట్లయితే, 100 గ్రాముల బాదం లో 230 మిల్లీగ్రాముల క్యాల్షియం, 100 గ్రాముల సోయాబీన్స్ లో 240 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఉలవల్లో చూసుకున్నట్లయితే, 100 గ్రాములు ఉలవల్లో 287 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.
రాగులలో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల గోంగూరలో, 344 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల మెంతికూరలో 395 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల తోటకూరలో 397 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల ఎండు కొబ్బరిలో 400 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.
100 గ్రాముల మునగాకులో 440 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల పొన్నగంటి కూరలో 510 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఇలా, ఈ ఆహార పదార్థాలలో పాల కంటే ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. కాబట్టి పాలే తీసుకోకర్లేదు. క్యాల్షియం ని పొందడానికి, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉండే ఈ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…