Teeth Whitening Foods : స్వీట్లు, జంక్‌ఫుడ్, ఇతర కొన్ని ఆహార పదార్థాలను తింటే మన దంతాలకు నష్టం కలుగుతుందని అందరికీ తెలిసిందే. వాటితో దంతాల మధ్య కావిటీలు వచ్చి దంతాలు పుచ్చిపోతాయి. దంతాలకు రంధ్రాలు పడతాయి. దీంతోపాటు చిగుళ్ల సమస్యలు కూడా బాధిస్తాయి. అయితే ఆయా ఆహార పదార్థాలను తినడం వల్ల ఎలాగైతే దంతాల సమస్యలు వస్తాయో.. అదే క్రమంలో కొన్ని ఆహార పదార్థాలను తింటే దంతాల సమస్యలు పోవడమే కాదు, దంతాలు తెల్లగా మారుతాయి. అవును, మీరు విన్నది నిజమే. ఈ క్రమంలో దంతాలను తెల్లగా చేసే అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రా బెర్రీల్లో మాలియిక్ యాసిడ్ అనే ఓ ఎంజైమ్ ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ పండ్లలో ఉండే విటమిన్ సి వల్ల కూడా దంతాలు తెల్లగా మారుతాయి. దంతాల మధ్య పేరుకుపోయే వ్యర్థాలు తొలగిపోతాయి. స్ట్రా బెర్రీలను తరచూ తింటుంటే దంత సమస్యలు బాధించవు. చిగుళ్లను దృఢంగా చేసి దంతాలను తెల్లగా మార్చే ఔషధ గుణాలు యాపిల్స్‌లో ఉన్నాయి. అంతే కాదు, యాపిల్స్ వల్ల నోట్లో ఉమ్మి కూడా బాగా తయారవుతుంది. ఇది నోట్లో ఉండే చెడు బాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రకోలిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది దంతాలను తెల్లగా మార్చేందుకు, దంతాలను దృఢంగా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
క్యారెట్లలో దంతాలను తెల్లగా చేసే గుణాలు ఉన్నాయి. వీటిని తరచూ తింటుంటే చాలు దంత సమస్యలు పోతాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి. చీజ్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది దంతాలను దృఢంగా చేయడమే కాదు, దంతాలను తెల్లగా మారుస్తుంది. దంతాల పైన ఉండే ఎనామిల్ పొర పోకుండా చూస్తుంది. బాదం పప్పు, జీడి పప్పు, వాల్‌నట్స్‌లలో దంతాలను తెల్లగా చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. పాచి పళ్లు ఉన్నవారు నట్స్‌ను తరచూ తింటుంటే మంచిది. దీంతో దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఉల్లిపాయలతో ఒకటే సమస్య. అది నోటి దుర్వాసన. ఉల్లిపాయలను తింటే నోరంతా వాసన వస్తుంది. కానీ నిజానికి ఉల్లిపాయల వల్ల మన దంతాలకు మేలే జరుగుతుంది. వాటిని పచ్చిగా తింటుంటే వాటిలో ఉండే సల్ఫర్ నోటి సమస్యలను పోగొడుతుంది. దంతాలను తెల్లగా మారుస్తుంది.
నారింజలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది దంతాలను దృఢంగా చేయడమే కాదు, తెల్లగా మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది. బ్రొమిలీన్ అనే రసాయనం పైనాపిల్స్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలకు పట్టిన పాచి, గార వంటి వాటిని తొలగించి దంతాలను తెల్లగా, దృఢంగా మారుస్తుంది. దంతాల మధ్య పేరుకుపోయిన వ్యర్థాలు, బాక్టీరియాను తొలగిస్తుంది. కనుక వీటిని రోజూ తింటుంటే ఎలాంటి దంత సమస్యలు అయినా సరే తగ్గిపోతాయి. దంతాలు తెల్లగా మారుతాయి. తళతళా మెరుస్తాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…