Barley Seeds : ఇటీవలి కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మగవారిలో కూడా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే కచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే. అలాగే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది. థైరాయిడ్ ఉన్న వారిలో అలసట, నీరసం, ఒత్తిడి, మైకం వంటి సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ ను నియంత్రణలో ఉంచేందుకు జింక్, ఐరన్, మెగ్నీషియం, అయోడిన్, విటమిన్ బి, సి, డి, సెలేనియం వంటి పోషకాలు అవసరం.
ఈ పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకుంటే థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు బార్లీ గింజలను తీసుకుంటే థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. బార్లీ గింజలను నీటిలో ఉడికించి ఆ నీటిని వడకట్టి తాగాలి. లేదంటే బార్లీ పిండిని జావగా చేసుకొని తాగవచ్చు. లేదంటే బార్లీ పిండిని ప్రతి రోజు ఒక స్పూన్ మోతాదులో కూరల్లో లేదా చపాతీలు, అట్లు వంటి వాటిలో కలుపుకొని తినవచ్చు.
బార్లీ గింజలు మనకు సులువుగానే అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ ఖర్చులో దొరుకుతాయి. అలాగే బార్లీ నీటిని తాగటం వలన థైరాయిడ్ సమస్య తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలసట, నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు తగినంత నీరు తాగాలి. అలాగే తగినంత నిద్ర ఉండాలి. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇలా థైరాయిడ్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి. అప్పుడే థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే థైరాయిడ్ ఉన్నవారు డాక్టర్ సూచన ప్రకారం తప్పనిసరిగా మందులు వాడాలి. దీంతో ఇతర ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…