Tea And Coffee : చాలామంది ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీలని తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీ కంటే కూడా ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే రోజూ ఉదయం టీ, కాఫీ కాకుండా వీటిని తీసుకోండి. వీటిలో ఏ ఒక్కటి తీసుకున్నా కూడా ఆరోగ్యం బాగుంటుంది. చాలా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
మరి ఉదయం పూట టీ, కాఫీ మానేసి ఏం తీసుకోవాలి.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర లేవగానే చాలా మంది టీ, కాఫీ తీసుకుంటూ ఉంటారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత నుండి అల్పాహారం దాకా ఒకటి కంటే ఎక్కువ సార్లు టీ, కాఫీలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా ఈ పానీయాలను తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది.
ఉదయం లేచాక పసుపు, మిరియాలతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. రెండు స్పూన్ల వరకు పసుపు తీసుకొని అందులో మిరియాలు కలిపి గోరువెచ్చని నీటితో తీసుకుంటే జీవక్రియ పెరుగుతుంది. శరీరంలో అదనపు కొవ్వు కరిగిపోతుంది. జీలకర్ర, వాము కలిపి తీసుకుంటే కూడా చక్కటి ప్రయోజనం ఉంటుంది. రెండు కప్పుల దాకా నీళ్లు తీసుకుని చిటికెడు జీలకర్ర, వాము వేసి మరిగించుకోండి.
సగం అయిన తర్వాత వడపోసి తీసుకోండి. దీంతో జీవక్రియని వేగవంతం చేయొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఉదయం పూట లేవగానే ఖాళీ కడుపుతో గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకోండి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. జీవక్రియలను వేగవంతం చేసుకోవచ్చు. వేడి నీటిలో నిమ్మరసం వేసుకొని కొద్దిగా తేనె కూడా వేసుకొని ఉదయాన్నే తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. చాలామంది ఇలా తీసుకుంటూ ఉంటారు. అయితే ఉదయం పూట టీ కాఫీలు తీసుకోకుండా ఉండలేము అని అనుకునేవారు టీ, కాఫీలని తీసుకునే ముందు నానబెట్టిన బాదం కానీ గుమ్మడి గింజల్ని కానీ తీసుకోండి. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…