ఆరోగ్యం

High BP : హైబీపీ ఉందా.. అయితే వీటిని క‌చ్చితంగా తీసుకోవాల్సిందే..!

High BP : హైబీపీ.. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, పనిభారం, ఇతరత్రా అనేక సమస్యల కారణంగా నేడు చాలా మంది హైబీపీ బారిన పడుతున్నారు. దీంతో అది గుండె జబ్బుల వంటి ఇతర అనారోగ్యాలకు దారి తీస్తోంది. అయితే రోజూ వ్యాయామం చేయడంతోపాటు కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను తీసుకుంటే దాంతో హైబీపీ బారి నుంచి బయట పడవచ్చు. తద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ద్రాక్ష పండ్లలో పొటాషియం, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హై బీపీని ఇట్టే తగ్గిస్తాయి. పొటాషియం సహజ సిద్ధమైన డై యురెటిక్ అవడం వల్ల కిడ్నీల నుంచి వ్యర్థ పదార్థాలు వెళ్లిపోతాయి. ప్రధానంగా సోడియం తొలగింపబడుతుంది. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడమే కాదు, హైబీపీ కూడా తగ్గుతుంది. పొటాషియం అధికంగా ఉండే పదార్థాల్లో అరటి పండు మొదటి స్థానంలో నిలుస్తుంది. హైబీపీ ఉంటే ఒక అరటి పండు తిన్నా చాలు, వెంటనే బీపీ అదుపులోకి వచ్చేస్తుంది. దీంతోపాటు అరటి పండ్లలో విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నిషియం కూడా సమృద్ధిగానే ఉంటాయి. అందువల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.

High BP

హైబీపీని అదుపు చేయడంలో ఉల్లిపాయలు అమోఘంగా పనిచేస్తాయి. వీటిలో అడినోసిన్ అనే మజిల్ రిలాక్సంట్ ఉంటుంది. ఇది బీపీని కూడా అదుపులోకి తెస్తుంది. నిత్యం ఒక పచ్చి ఉల్లిపాయను అలాగే తింటున్నా లేదంటే దాన్ని జ్యూస్ తీసుకుని తాగినా రెండు వారాల్లో హైబీపీ తగ్గుముఖం పడుతుంది. రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించి రక్త సరఫరాను మెరుగు పరిచే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. దీని వల్ల బీపీ కూడా అదుపులోకి వస్తుంది. నిత్యం రెండు వెల్లుల్లి రెబ్బల్ని తింటుంటే చాలు, హై బీపీ తగ్గుముఖం పడుతుంది. లేదంటే వాటిని జ్యూస్ తీసుకుని అయినా తాగవచ్చు. దీంతో శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా పోతుంది. గుండె సమస్యలు రావు.

సోడియం, కాల్షియం, విటమిన్ సి వంటి అనేక పోషకాలతోపాటు కొబ్బరి నీటిలో పొటాషియం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది హై బీపీని వెంటనే అదుపులోకి తెస్తుంది. కొన్ని కొబ్బరి నీళ్లు తాగితే చాలు, బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయల్లో అర్గినైన్ అనే అమైనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది హై బీపీని కంట్రోల్ చేస్తుంది. కొద్దిగా పుచ్చకాయ తిన్నా లేదంటే దాని జ్యూస్ తాగినా చాలు, బీపీ అదుపులోకి వస్తుంది. అంతేకాదు రక్తం గడ్డక‌ట్ట‌కుండా చూసే గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది.

యాంటీ మైక్రోబియల్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కొత్తిమీరలో ఉన్నాయి. ఇవి బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, బీపీలను తగ్గిస్తాయి. పుదీనాలోని ఔషధ గుణాలు రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగుపడి బీపీ అదుపులోకి వస్తుంది. హై బీపీ ఉంటే కొంత నిమ్మరసం తాగినా చాలు వెంటనే బీపీ అదుపులోకి వస్తుంది. ఇందులో విటమిన్ సితోపాటు మరెన్నో పోషకాలు ఉండడం వల్ల రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది. దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM