Cloves : మనం వంటల్లో లవంగాలని వాడుతూ ఉంటాము. లవంగాల వలన కలిగే మేలు గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. లవంగాలని తీసుకోవడం వలన వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. ఆర్థరైటిస్‌తో బాధపడే వాళ్ళకి లవంగాలు చాలా చక్కగా పనిచేస్తాయి. గుండె సమస్యలు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వాటి నుండి కూడా బయట పడేస్తాయి.
చాలామంది లవంగాలని నములుతూ ఉంటారు. అలా తీసుకోవడం వలన అనేక లాభాలని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి రోజూ ఉదయం పూట ఖాళీ కడుపు తో లవంగాలని నమిలితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఖాళీ కడుపుతో లవంగాలని నమలడం వలన లివర్ ఆరోగ్యం బాగుంటుంది.
అదేవిధంగా లవంగాలను తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. షుగర్ తో బాధపడే వాళ్ళకి ఇది ఔషధం అని చెప్పచ్చు. రోజు ఖాళీ కడుపుతో లవంగాలని నమలడం వలన వికారం తగ్గుతుంది. నోటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పంటి నొప్పి వంటి వాటిని కూడా లవంగాలు తొలగిస్తాయి. ఎన్నో ఏళ్ల నుండి పంటి నొప్పికి లవంగాలని ఔషధంలా వాడుతున్నారు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వీటిలో ఉండడం వలన నోరు శుభ్రంగా ఉంటుంది.
లవంగాల వలన అజీర్తి సమస్యలు కూడా తొలగిపోతాయి. డయేరియా, వాంతులు వంటి బాధల నుండి కూడా బయటపడవచ్చు. జాయింట్ పెయింట్స్ తో బాధపడే వాళ్ళకి కూడా లవంగాలు బాగా పనిచేస్తాయి. లవంగాల నూనెని రాసుకోవడం వలన జాయింట్ పెయిన్స్ బాగా తగ్గిపోతాయి. మలబద్ధకం సమస్య నుండి కూడా లవంగాలు మనల్ని బయటపడేస్తాయి. నాచురల్ పెయిన్ కిల్లర్ల లాగా పనిచేస్తుంది. ఆ శక్తిని కూడా ఇది పెంచగలదు. ఇలా వంగాలతో అనేక లాభాలని పొంది అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…