Sugar Palm Fruit : మనకు ఏడాది పొడవునా పలు సీజన్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒక్కో సీజన్‌లో మనకు వివిధ రకాల పండ్లు లభిస్తాయి. ఇక వేసవిలోనూ పలు రకాల పండ్లు లభిస్తుంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాయి. కానీ వాటిని పండ్లు అని అనలేరు. ఎందుకంటే అవి తాటి ముంజలు మరి. అవును.. వీటిని పండ్లు.. అని అనలేం. కానీ వీటితోనూ మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో లభించే తాటి ముంజలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాటి ముంజలు మనకు చలవ చేస్తాయి. వేసవిలో శరీర తాపాన్ని తగ్గిస్తాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. కనుక వీటిని రోజూ తినాల్సిందే. అయితే ఎక్కువగా తింటే మలబద్దకం వస్తుంది. కనుక వీటిని మూడు లేదా నాలుగుకు మించి తినరాదు. ఇక వీటిల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటిచూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను పోగొడుతుంది. కాబట్టి కళ్లకు తాటి ముంజలు మంచి ఆహారం అని చెప్పవచ్చు.
తాటి ముంజల్లో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది చర్మాన్ని, వెంట్రుకలను సంరక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. వీటిల్లో ఐరన్ అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే రక్తం అధికంగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే తాటి ముంజల్లో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పురుషుల్లో వచ్చే శృంగార సమస్యలను పోగొడుతుంది. వీర్యం అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి.
తాటి ముంజలను మోతాదులో తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, కడుపులో మంట తగ్గుతాయి. అదే మోతాదుకు మించితే మలబద్దకం వస్తుంది. కనుక ముంజలను తక్కువ మోతాదులో తినాలి. వీటిని తింట మొటిమలు కూడా తగ్గుతాయి. కనుక ఈ సీజన్‌లో వీటిని తప్పక ఆహారంలో భాగం చేసుకోవాలి.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏది చేసినా సంచలనమే అవుతుంది. అయితే తాజాగా ఈయన…
బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి కెనరా బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. కెనరా బ్యాంకులో కాంట్రాక్టు బేసిస్ విధానంలో స్పెషలిస్ట్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను…
న్యూఢిల్లీలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…