Roots Vegetables : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకి దొరికే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. చలికాలంలో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలు వుండవు. అయితే, ఇటువంటి సమస్యలు కలగకుండా ఆరోగ్యం బాగుండాలంటే, ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. వీటిని కనుక మీరు తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. దుంప కూరల్లో కావాల్సిన పోషకాలు దొరుకుతాయి. విటమిన్స్, మినరల్స్ తో పాటుగా ఉంటుంది.
ఈ పోషకాలు, మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. శీతాకాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. దుంప కూరలు తీసుకుంటే, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలానే, యాంటీ ఆక్సిడెంట్లు కూడా బాగా ఇందులో ఉంటాయి. శీతాకాలం లో ఎక్కువ మనకి ఇన్ఫెక్షన్స్, జలుబు, ఫ్లూ వంటివి వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలి. క్యారెట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ తో పాటుగా విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి.
![Roots Vegetables : చలికాలంలో వీటిని తింటే.. అనారోగ్య సమస్యలే వుండవు..! Roots Vegetables in winter take them for many benefits](https://i0.wp.com/indiadailylive.com/wp-content/uploads/2023/12/roots-vegetables.jpg?resize=1200%2C675&ssl=1)
రోగనిరోధక శక్తిని కూడా, క్యారెట్ పెంచుతుంది. అలానే, చలికాలంలో చిలగడ దుంప తీసుకుంటే కూడా, ఆరోగ్యం బాగుంటుంది. వృద్ధాప్య ఛాయలు ని ఇది తగ్గిస్తుంది. రోగి నిరోధక శక్తిని పెంచుతుంది. కానీ, చూపుని మెరుగుపరుస్తుంది. బీట్రూట్ కూడా చలికాలంలో తీసుకోవడం మంచిది.
ఇందులో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన రక్తహీనత సమస్య ఉండదు. ముల్లంగి తీసుకుంటే కూడా, ఆరోగ్యం బాగుంటుంది. పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. ఎర్ర రక్త కణాలని ముల్లంగి వృద్ధి చేస్తుంది. జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. ముల్లంగితో ఎముకలు, దంతాలు కూడా దృఢంగా మారుతాయి. ముల్లంగిని తీసుకుంటే కూడా చలికాలంలో ఆరోగ్యం బాగుంటుంది.