ఆరోగ్యం

Raw Papaya : ప‌చ్చి బొప్పాయిని కూడా తిన‌వ‌చ్చు తెలుసా.. ఎన్ని లాభాలు క‌లుగుతాయంటే..?

Raw Papaya : బొప్పాయి మన దేశానికీ 400 సంవత్సరాల క్రితమే వచ్చింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. బొప్పాయి కారకేసి కుటుంబానికి చెందింది. బొప్పాయి పండు తింటే ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. కానీ పచ్చి బొప్పాయిలో దాగి ఉన్న ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. పచ్చి బొప్పాయిని తింటే శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి బొప్పాయిలో మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ ఎ, సి, ఇ లు సమృద్ధిగా ఉంటాయి.

అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు బొప్పాయిని తింటే శరీరంలో తొందరగా కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. డయాబెటిస్ తో బాధపడుతున్నవారు పచ్చి బొప్పాయి జ్యుస్ తాగితే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే శరీరంలో ఇన్సులిన్ మోతాదు పెరుగుతుంది. పచ్చిబొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం లాంటి సమస్యలను పరిష్కరిస్తుంది. అలాగే ఉదరంలో గ్యాస్ తయారుకావడాన్ని నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. అలాగే విటమిన్ల లోపం ఎదురుకాకుండా చూస్తుంది.

Raw Papaya

గర్భిణీలు పచ్చి బొప్పాయి పండ్లను మాత్రం తినరాదు. ఎందుకంటే వాటిల్లో ఉండే లేటెక్స్, పాలవంటి పదార్థం గర్భాశయంపై ప్రభావం చూపుతుంది. దీంతో అబార్షన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చి బొప్పాయిల‌ను గర్భిణీలు తినరాదు. అయితే డెలివరీ అయ్యాక తల్లికి పాలు బాగా పడాలంటే పచ్చి బొప్పాయి ఎంతో తోడ్పడుతుంది. తురుముకుని కూర చేసుకున్నా, పాలు, చక్కెర వేసుకుని హల్వా చేసుకున్నా మంచిదే. పచ్చి బొప్పాయిని ఏ రూపంలో తీసుకున్న ఫ‌ర్వాలేదు. పచ్చి బొప్పాయిలో చైమప్యాపిన్, పాపైన్ అనే రెండు శక్తివంతమైన ఎంజైమ్స్ ఉండుట వలన ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నానికి సహాయపడతాయి. పచ్చి బొప్పాయిలో కెరోటినాయిడ్స్ టమోటా, క్యారెట్ ల కన్నా ఎక్కువ మొత్తంలో ఉంటాయని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ జరిపిన అధ్యయనంలో తెలిసింది.

పచ్చి బొప్పాయిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండుట వలన ఆస్తమా, ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, సోడియం సమృద్ధిగా ఉండుట వలన రక్త ప్రవాహాన్ని నియంత్రించి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే బీటా కెరోటిన్‌ శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌ దుష్ఫలితాలను నివారించి క్యాన్సర్‌ రాకుండా నియంత్రణలో ఉంచుతుంది. పచ్చి బొప్పాయిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో శరీరంలో ఇన్ ఫెక్షన్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అందువ‌ల్ల ప‌చ్చి బొప్పాయిని తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM