Papaya : మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో బొప్పాయి పండు కూడా ఒకటి. ఇవి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. బొప్పాయి పండ్లు అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. అందరూ ఇష్టంగా వీటిని తింటారు. మనకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇవి ఇళ్లలోనే విరివిగా పండుతాయి. అయితే ఏ సీజన్ అయినా సరే బొప్పాయి పండ్లను తినడం మరిచిపోకూడదు. ఆడ లేదా మగ ఎవరైనా సరే ఈ పండ్లను రోజూ తప్పకుండా తినాలి. బొప్పాయి పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి పండ్లలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు సి, ఎలతోపాటు ఫోలేట్, పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీర విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరాన్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లు సులభంగా జీర్ణం చేసి మనకు శక్తిని అందిస్తుంది. అందువల్ల మాంసాహారం తిన్నప్పుడు లేదా అతిగా తిన్నప్పుడు బొప్పాయి పండ్లను తింటే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. అలాగే మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం అనేది ఉండదు.
బొప్పాయి పండ్లలో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఈ పండ్లలో ఉండే విటమిన్ సి కూడా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇవన్నీ శరీరంలోని హానికర ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీని వల్ల కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. అందువల్ల సీజన్లు మారినప్పుడు తప్పనిసరిగా బొప్పాయి పండ్లను తినాలి. దీంతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా విష జ్వరాలు రాకుండా ఉంటాయి.
బొప్పాయి పండ్లలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో చర్మాన్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల చర్మానికి మేలు చేసే కొల్లాజెన్ ఉత్పత్తి చేయబడుతుంది. ఇది చర్మానికి ఎంతో అవసరం. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటారు. చర్మం కాంతివంతంగా మారి మెరిసిపోతుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. బొప్పాయి పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.
బొప్పాయి పండ్లలో పపైన్, కైమోపపైన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. బొప్పాయి పండ్లలో విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా చూస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. బొప్పాయి పండ్లలో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీన్ని తక్కువ తిన్నా చాలు.. పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. ఇలా బొప్పాయి పండ్లను తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక దీన్ని రోజూ మరిచిపోకుండా తినండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…