Nutrients For Brain : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే మనం ఏ పని చేయాలన్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కచ్చితంగా మన మెదడు బాగా పని చేయాలి. మెదడు బాగా పనిచేయాలంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మెదడు ఆరోగ్యం బాగుండడానికి ఎటువంటి పోషకాలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మెదడు ఆరోగ్యం కోసం ఈ పోషకాలను కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి.
అప్పుడే మెదడు పని తీరు బాగుంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా అవసరం. వీటిని తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆలోచనా విధానం మారుతుంది. మెదడు అభివృద్ధికి కచ్చితంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుండే ఆహార పదార్దాలని తీసుకోవాలి. ఐరన్ ని కూడా కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. మెదడు పనితీరుపై ఐరన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెదడు బాగా పనిచేయడానికి మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండడానికి విటమిన్ బి12 కూడా అవసరం.
విటమిన్ బి12 సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే మూడ్ కూడా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే మెదడు ఆరోగ్యానికి విటమిన్ డి కూడా అవసరం. విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి అవసరం. అలాగే మెదడు పనితీరుపై కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెదడు ఆరోగ్యానికి విటమిన్ డి కూడా చాలా అవసరం. కాబట్టి విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండాలి. విటమిన్ డి తో డిమెన్షియా రిస్క్ కూడా ఉండదు. మెదడు ఆరోగ్యానికి జింక్ కూడా అవసరం.
అలాగే విటమిన్ ఇ కూడా మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ ఇ ఉండే ఆహార పదార్థాలని కూడా తీసుకోండి. జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మెగ్నీషియం కూడా రోజు డైట్ లో ఉండేట్టు చూసుకోవాలి. మెగ్నీషియం లెవెల్స్ తక్కువగా ఉంటే మైగ్రేన్, డిప్రెషన్ వంటి సమస్యలు ఉంటాయి. మెదడు పని తీరుకి క్యాల్షియం కూడా అవసరం. విటమిన్ కె, సెలీనియం కూడా మెదడు ఆరోగ్యానికి అవసరమే. ఈ పోషక పదార్థాలని కనుక మీరు రోజు వారి ఆహారంలో తీసుకున్నట్లయితే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…