Liver Damage Symptoms : చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. లివర్ వలన కూడా చాలామంది సతమతమవుతున్నారు. లివర్ సమస్యలని ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్నారు. అయితే మీ లివర్ ప్రమాదంలో ఉందని ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సంకేతాలు కనపడుతున్నట్లయితే కచ్చితంగా మీ లివర్ పెద్ద ప్రమాదంలో ఉందని గ్రహించాలి. మరి ఎలాంటి లక్షణాలు లివర్ ప్రమాదంలో ఉంటే కనపడతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కాలేయం ఎంతో ముఖ్యమైన పని చేస్తుంది. శరీరంలో ఇది అతి పెద్ద ముఖ్యమైన అవయవం. మద్యానికి బానిసలు అయిన వాళ్లలో కాలేయం త్వరగా దెబ్బతింటుంది. అనేక రకాల సమస్యలను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకలి వేయకపోవడం కాలేయ సమస్య అని గుర్తించాలి. కాలేయం హానికరమైన టాక్సిన్స్ ని బయటకి పంపించినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆకలి మీకు అసలు వేయదు.

ఇలా జరుగుతున్నట్లయితే కచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. మూత్రం, మలం రంగు బట్టి కూడా కాలేయ సమస్య అని గుర్తించొచ్చు. మూత్రం రంగు ముదురు రంగులో ఉంటే కాలేయ సమస్య ఉందని గుర్తుపెట్టుకోండి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే కూడా కాలేయ సమస్య అని గుర్తుపెట్టుకోవాలి. గుండె సమస్యలకి కూడా ఇది సంకేతమే. కాలేయ సమస్య బాగా ఎక్కువయినప్పుడు ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. దాంతో ఊపిరాడకపోవడం, శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటారు.
లివర్ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మల రక్తస్రావం కలుగుతుంది. ఇలా జరిగితే కూడా డాక్టర్ని సంప్రదించాలి, లివర్ సమస్య అని గ్రహించాలి. కాలేయం కనుక పాడయిందంటే చర్మంపై ప్రభావం పడుతుంది. కాలేయ సమస్య వలన శరీరంలో మార్పులు కనపడతాయి. చర్మంపై దురద వంటివి కలుగుతూ ఉంటాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ లేదంటే దురద వంటివి కలిగినప్పుడు కూడా అసలు నిర్లక్ష్యం చేయకండి. లివర్ సమస్యలకి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. కనుక ఈ సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే డాక్టర్‌ని కలవాలి. దీంతో సరైన సమయంలో చికిత్స తీసుకుని లివర్‌ని సంరక్షించుకోవచ్చు.