Kidney Stones : మన శరీరంలో ముఖ్యమైన అవయవాలల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. శరీరంలో ఉండే వ్యర్థాలను, మలినాలను బయటకు పంపించడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవడం చాలా అవసరం. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటే మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. అయితే నేటి తరుణంలో చాలా మంది మూత్రపిండాలల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అని చెప్పవచ్చు. మారిన మన జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, నీటిని తక్కువగా తాగడం, ఉప్పు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. మూత్రపిండాలల్లో రాళ్ల సమస్య మరీ తీవ్రంగా ఉంటే శస్త్ర చికిత్స ద్వారా వాటిని తొలగిస్తారు. సమస్య తక్కువగా ఉంటే మందులను వాడాల్సి ఉంటుంది.
ఇక మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు అలాగే ఈ సమస్య రాకూడదు అనుకునే వారు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు తీసుకోవాల్సిన మరియు తీసుకోకూడని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే మూత్రపిండాల్లో ఉండే రాళ్ల పరిమాణం పెరగకుండా ఉంటుంది. అలాగే చిన్నగా ఉన్న రాళ్లు మూత్రం ద్వారా బయటకు పోతాయి. నీటితో పాటు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్ వంటి వాటిని కూడా తీసుకోవచ్చు. అయితే టమాట జ్యూస్, క్రాన్ బెర్రీ జ్యూస్, ద్రాక్ష పండ్ల జ్యూస్ ను మాత్రం తీసుకోకూడదు. అలాగే శీతల పానీయాలను కూడా తీసుకోకూడదు. అలాగే మూత్రిపండాల్లో రాళ్ల సమస్య ఉన్న వారు సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
నిమ్మకాయలు, నారింజ, వాటర్ మెలన్, బత్తాయి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు క్యాల్షియం ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అనగా పాలు, పాల పదార్థాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటిని తీసుకోవాలి. అలాగే విటమిన్ బి6 ఉండే ఆహారాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ బి6 ఆక్సలేట్స్ ను తగ్గిస్తుంది. కనుక మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు విటమిన్ బి6 ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. విటమిన్ బి6 అరటిపండ్లు, అవకాడో, ఓట్స్, సోయాబీన్స్, మామిడికాయలల్లో ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారు వాల్ నట్స్, అవిసె గింజలతో పాటు ఆక్సలేట్స్ తక్కువగా ఉండే బియ్యం, పప్పు ధాన్యాలు, క్యారెట్, కాకరకాయ వంటి వాటిని తీసుకోవాలి. ఇక మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారు ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, చిప్స్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అలాగే పంచదారను కూడా తక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే పాలకూర, టమాట, క్యాబేజి, వంకాయ, బీట్ రూట్, బంగాళాదుంప, చాక్లెట్స్ ను తక్కువగా తీసుకోవాలి. అలాగే మాంసాన్ని కూడా తక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా తగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య మరింత తీవ్రతరం కాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…