Jeera Water : ప్రతి వంటలోనూ ఉపయోగించే దినుసుల్లో జీలకర్ర కూడా ఒకటి. జీలకర్రను వాడడం వల్ల వంటల రుచి పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మన ఆరోగ్యానికి కూడా జీలకర్ర ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రలో థైమాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది ఆహారం జీర్ణమవ్వడానికి అవసరమయ్యే జీర్ణరసాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో సహాయపడతాయి. అలాగే జీలకర్రను తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ చాలా సులభంగా కరిగిపోతుంది. జీలకర్రలో ఉండే థైమో క్వినోన్ అనే రసాయన సమ్మేళనం కాలేయాన్ని ఉత్తేజపరిచి శరీరంలో జీవక్రియల రేటును పెంచుతుంది. దీంతో కొవ్వు కణాల్లో ఉండే కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది.
కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండడం వల్ల ఇన్ ప్లామేషన్ రావడంతో పాటు క్రమంగా ఇన్సులిన్ నిరోధకత వచ్చి షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కనుక శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న వారు జీలకర్రను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను చాలా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. జీలకర్రను రెండు గ్రాముల మోతాదులో 8 వారాల పాటు తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అలాగే ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. జీలకర్రను లేదా జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యనుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ నీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. అలాగే జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
అయితే జీలకర్రను మనం ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాము. నూనెలో వేసి వేయించడం వల్ల జీలకర్రలో ఉండే రసాయనాలు, యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కనుక సాధ్యమైనంత వరకు జీలకర్ర నీటిని తీసుకోవడానికే ప్రయత్నించాలి. జీలకర్రను నీటిలో వేసి 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ నీటిని మరిగించి వడకట్టాలి. ఈ నీటిని మనం తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరిగిస్తాము కనుక జీలకర్రలో ఉండే పోషకాలు నశించకుండా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
సులభంగా బరువు తగ్గవచ్చు. షుగర్ వ్యాది అదుపులో ఉంటుంది. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ విధంగా జీలకర్ర నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరూ తప్పకుండా ఈ జీలకర్ర నీటిని తీసుకోవాలని ముఖ్యంగా ఊబకాయంతో బాధపడేవారు ఈ నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…