ఆరోగ్యం

Jaggery With Milk : రాత్రి పూట ఇలా పాల‌లో బెల్లం క‌లిపి తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Jaggery With Milk : పాలు మ‌న శ‌రీరానికి సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క విట‌మిన్ల‌ను అంద‌జేస్తాయి. బెల్లంను చ‌క్కెర‌కు ప్ర‌త్యామ్నాయంగా వాడ‌తారు. దీంతో అనేక పిండి వంటలు చేసుకుంటారు. సాధార‌ణ చ‌క్కెర క‌న్నా బెల్లం తిన‌డం వ‌ల్లే మ‌న‌కు ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది. అయితే వేడి వేడి పాల‌లో కొద్దిగా బెల్లం క‌లుపుకుని తాగితే ఎలా ఉంటుంది..? టేస్ట్ అదిరిపోతుంది క‌దా..! కొంద‌రు పాలు ఇలాగే తాగుతారు. అయితే ఇలా పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే కేవ‌లం రుచి అంద‌డం మాత్ర‌మే కాదు, మ‌న‌కు క‌లిగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా పోతాయి. ఈ క్ర‌మంలో అలా తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేడి వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే అధిక బ‌రువు త‌గ్గుతారు. బెల్లం, పాల‌లో ఉండే ప‌లు ర‌కాల ఔష‌ధ గుణాలు శ‌రీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును త‌గ్గిస్తాయి. త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు. నిత్యం తాగ‌డం వ‌ల్ల వెయిట్ అదుపులో ఉంటుంది. నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య ర‌క్త హీన‌త‌. అనీమియా. దీని వ‌ల్ల శ‌రీరంలో ర‌క్తం స‌రిగ్గా ఉండ‌దు. ఫలితంగా ఆరోగ్యం చెడిపోతుంది. పోష‌కాలు అంద‌వు. అయితే బెల్లం క‌లిపిన పాలు తాగుతుంటే ర‌క్త హీన‌త స‌మ‌స్య ఇట్టే పోతుంది. ర‌క్తం బాగా ప‌డుతుంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది.

Jaggery With Milk

బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగడం వ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు పోతుంది. రుతు స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు వ‌చ్చే వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు, ప్ర‌ధానంగా క‌డుపునొప్పి త‌గ్గుతుంది. బెల్లం క‌లిపిన వేడి పాలలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అవి అనారోగ్యాల‌ను క‌లిగించే వైర‌స్‌లు, బాక్టీరియాల భ‌ర‌తం ప‌డ‌తాయి. దీంతో ప‌లు ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వృద్ధాప్యంలో చాలా మందికి కీళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. అయితే అలాంటి వారు రోజూ వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే దాంతో ఆయా నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతేకాదు కీళ్లు దృఢంగా మారుతాయి.

బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగుతుంటే దాంతో జీర్ణ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి ఇబ్బందులు తొల‌గిపోతాయి. బెల్లం, పాలలో అద్భుతమైన పోషకాలు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి క‌చ్చితంగా ప్రతి రోజూ వీటి కాంబినేష‌న్ తీసుకుంటే మంచిదని అధ్యయనాలు నిరూపించాయి. ప్రతిరోజూ తీసుకుంటే క‌చ్చితంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM