Pain Killers : చాలామంది, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ని వాడుతుంటారు. పెయిన్ కిల్లర్స్ ని ఉపయోగించడం వలన, అనేక సమస్యలు వస్తాయి. కొంతమంది ఒంట్లో ఏ చిన్న తేడా వచ్చినా, నొప్పి కలిగినా వెంటనే, పెయిన్ కిల్లర్ వాడుతూ ఉంటారు. డాక్టర్లు సలహా అసలు తీసుకోరు. పెయిన్ కిల్లర్స్ ని ఎక్కువగా వాడడం వలన, అనేక సమస్యలు వస్తాయి. చాలామంది, పెయిన్ కిల్లర్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. తలనొప్పి వచ్చినా, ఇతర నొప్పులు వచ్చినా కూడా, వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకుంటూ ఉంటారు.
ఇండియన్ ఫార్మా కమిషన్ ఈ ఔషధానికి సంబంధించి, హెచ్చరిక ని జారీ చేసింది. మెఫ్టాల్ అధిక వినియోగం డ్రెస్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన అలెర్జీలను ఇవి కలిగిస్తాయి. దీని ప్రభావం మొత్తం, శరీరంపై అలర్జీ రూపంలో కనపడుతుంది. దీనితో అనేక ఇబ్బందులు కలుగుతాయి. పెయిన్ కిల్లర్స్ ఎల్లప్పుడూ ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి. తక్షణ ఉపశమనం కోసం. తరచుగా వాడుతూ ఉంటాము. పెయిన్ కిల్లర్స్ ని ఎక్కువ తీసుకోవడం వలన, జీర్ణవ్యవస్థ పై చెడు ప్రభావం పడుతుంది.

పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వలన ఎసిడిటీ వంటి సమస్యలు కలుగుతాయి. పెయిన్ కిల్లర్ ఎక్కువగా వాడడం వలన, కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుంది. కిడ్నీల పనితీరుపై ఇబ్బంది కలుగుతుంది. పెయిన్ కిల్లర్స్ ని ఎక్కువ వాడడం వలన, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా జరగొచ్చు.
పెయిన్ కిల్లర్స్ ని ఎక్కువ వాడడం వలన, యాంటీ రెసిస్టెన్స్ ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. కొంతకాలానికి, ఈ పెయిన్ కిల్లర్స్ ని తీసుకున్నా కూడా, అవి పని చేయవు. అందుకని, పెయిన్ కిల్లర్ ని వాడడం మంచిది కాదు. ఎక్కువగా, పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళు, ఈ విషయాలని కచ్చితంగా గుర్తు పెట్టుకుంటే మంచిది.