ఆరోగ్యం

Chapati : బరువు తగ్గాలని రాత్రిపూట అన్నం బదులు చపాతీ తింటున్నారా..? అయితే ఈ 5 విషయాల‌ను తప్పక తెలుసుకోండి..!

Chapati : స్థూలకాయం అనేది నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. మారిన జీవన ప్రమాణాలు, కాలుష్యం, ఆహారపు అలవాట్ల వలన పెరిగిన శారిరక బరువు పెద్ద సమస్యగా మారింది. దీంతో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేసే మొదటి పనుల్లో తినే ఆహారాన్ని తగ్గించుకోవడం లేదంటే అన్నం బదులు చపాతీలు తినడం చేస్తున్నారు. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు. కాకపోతే చపాతీల‌ను తినేవాళ్లు కొన్ని విషయాల‌ను తెలుసుకోవాలి.

చపాతీల‌ని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనే వేయకుంటే మరింత మంచిది. పని ఒత్తిడిలో ఏ అర్థ‌రాత్రో భోజనం చేసి వెంటనే కునుకు తీస్తుంటారు. కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి,నిద్ర పోవడానికి మధ్య గ్యాప్ ఉంటే బాగుంటుంది. అలా చేయలేని వారికి చపాతీల‌ను తీసుకోవడం ఉత్తమం. ప్లేట్‌ నిండుగా భోజనం చేసినా 2, 3 చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. ఏదైనా అతి అనర్థ‌దాయకమే. కాబట్టి చపాతీలు మితంగానే తీసుకోవాలి. ప్లేట్ నిండా అన్నం తింటాం కదా అని ప్లేట్ నిండా చపాతీలు తింటే ఇంక ఏం ఉపయోగం ఉండ‌దు. క‌నుక 2 చ‌పాతీల‌కు మించ‌కుండా తినాలి.

Chapati

మనదేశంలో ఎక్కువ మంది రక్త హీనతతో కూడా బాదపడుతున్నారు. చపాతీల‌ను తినడం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు. గోధుమల్లో ఐరన్‌ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. నిద్ర పోయేప్పుడు శక్తి నామమాత్రంగానే ఖర్చవుతుంది. మనలోని క్యాలరీలు ఏమాత్రం తగ్గవు. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాక పోవడంతో కొవ్వుగా మిగిలి పోయి మనిషి లావు అయ్యే ప్రమాదం ఉంటుంది. గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. ఎక్కువగా విటమిన్‌ బి, ఇ, కాపర్‌, అయోడిన్‌, జింక్‌, మాంగనీస్‌, సిలికాన్‌, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. అందువ‌ల్ల రాత్రి పూట చ‌పాతీల‌ను తింటే బ‌రువు పెర‌గ‌రు. పైగా బ‌రువు త‌గ్గుతారు. ఇలా చ‌పాతీల‌ను రాత్రి పూట తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM