ఆరోగ్యం

Vegetarian : మీరు వెజిటేరియన్లా..? అయితే మాంసాహారం తింటున్నారేమో ఒక సారి చూడండి..!

Vegetarian : మీరు శాకాహార ప్రియులా..? శాకాహారం తప్ప మాంసాహారం ముట్టుకోరా..? అయితే మీరు పప్పులో కాలేసినట్టే..! ఎందుకంటే శాకాహారం అనుకుని మీరు తింటున్న ఆహారంలో కూడా కొంత మాంసాహారం కలుస్తుందట..! ఆశ్చర్యంగా ఉందా..! కానీ ఇది నిజమే. శాకాహారంగా కనిపిస్తున్నా కొన్ని పదార్థాల్లో ఎంత లేదన్నా కొంత మాంసం లేదా దాని సంబంధ పదార్థాలు కచ్చితంగా ఉంటాయట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర తయారు చేసే సమయంలో దాన్ని శుద్ధి చేయడం కోసం సహజసిద్ధమైన నాచురల్ కార్బన్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇక్కడే విషయం అంతా ఉంది. ఆ నాచురల్ కార్బన్‌ను జంతువుల ఎముకలను కాల్చడం ద్వారా తయారు చేస్తారు. ఇప్పుడర్థమైందా..! చక్కెర కూడా మాంసాహార సంబంధ పదార్థమేనని. ఈ క్రమంలో చక్కెరను వాడాలనుకుంటే అన్‌రిఫైన్డ్ షుగర్‌ను వాడితే సరిపోతుంది. లేదంటే దాని బదులు బెల్లం కూడా ఉపయోగించవచ్చు.

కరకరలాడుతూ ఘాటు ఘాటుగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్‌లోనూ మాంసం అవశేషాలు ఉంటాయట. బీఫ్ కొవ్వు నుంచి తీసిన కొన్ని పదార్థాలను ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసేందుకు ఉపయోగిస్తారట. అయితే ఆ పదార్థాలను ముందుగా ప్రాసెస్ చేస్తారు. అనంతరం ఫ్రైస్ తయారీలో ఉపయోగిస్తారు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉన్న బ్రెడ్, గుండె ఆరోగ్యానికి మంచిది అంటూ అనేక కంపెనీలు తమ తమ బ్రెడ్లను అమ్ముతుంటాయి. అయితే వాటిలో చేపల ఆయిల్‌తోపాటు, అవిసె గింజలు, మనిషి, పంది, కోడి వెంట్రుకల నుంచి తీసిన ఎల్-సిస్టీన్ అనే పదార్థాలను ఉపయోగిస్తారట.

Vegetarian

బీర్, వైన్ వంటి ఆల్కహాల్ డ్రింక్స్‌లోనూ మాంసం అవశేషాలు ఉంటాయట. ఫిష్ బ్లాడర్ లేదా ఎండ్రకాయ డొప్పలు లేదా జంతువుల ఎముకలు, లిగ్‌మెంట్స్ నుంచి తీసిన పలు పదార్థాలను ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ తయారీలో వాడతారట. రెస్టారెంట్లలో సూప్‌లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే వాటి తయారీలో వాడే సాస్‌లలో చేపల నుంచి తీసిన పదార్థాలను వాడతారట. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న నూనెలు గుండెకు చాలా మంచివని ఆయా కంపెనీలు తమ తమ వంట నూనెలను అమ్ముతుంటాయి. అయితే వాటిలో చేపలు లేదా గొర్రెల నుంచి తీసిన లానొలిన్ అనే పదార్థాలను వాడతారట. కూరగాయలు, పండ్ల సలాడ్స్ కోసం వాడే డ్రెస్సింగ్ ఆహార పదార్థాల్లో కోడిగుడ్ల నుంచి తీసిన అవశేషాలు ఉంటాయి. కాబట్టి సలాడ్స్‌లో కూడా మాంసాహారం ఉంటుంది.

జంతువుల మాంసం నుంచి తీసిన గెలాటిన్ అనే పదార్థం జెల్లీల్లో ఉంటుంది. అయితే ప్రస్తుతం అధిక శాతం జెల్లీల్లో గెలాటిన్‌కు బదులుగా ఇతర పదార్థాలను వాడుతున్నారు. కాబట్టి కొంత వరకు సేఫ్‌గానే ఉండవచ్చు. ఎగ్ లేకుండా తయారు చేసిన కేకులను ప్రస్తుతం ఎక్కువ మంది శాకాహారులు తింటున్నారు. అయితే వారు కేక్ మిక్స్‌లతో కేకులను తయారు చేసుకుని తింటున్నారు. ఈ క్రమంలో కేక్ మిక్స్‌లను ఒకసారి పరిశీలిస్తే వాటిలో పంది కొవ్వు నుంచి తీసిన పదార్థాలు ఉంటాయట. కాబట్టి కేక్ మిక్స్‌లపై కూడా జాగ్రత్త వహించాలి.

Share
IDL Desk

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM