Belly Button : నిత్యం వ్యాయామం చేయడం, తగిన సమయానికి భోజనం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం మన శరీరానికి ఎంత అవసరమో, దాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా అవసరమే. లేదంటే ఎన్నో రకాల అనారోగ్యాలు వ్యాపించేందుకు పొంచి ఉంటాయి. శరీరం మొత్తం శుభ్రంగా ఉంటేనే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే నిత్యం స్నానం చేస్తూ దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నా అధిక శాతం మంది మరిచిపోయే భాగం ఒకటుంది. అదే బొడ్డు.
అవునండీ, అదే బొడ్డు. మన శరీరం మధ్య భాగంలో ఉండే నాభి. అవును, చాలా మంది స్నానమైతే చేస్తారు కానీ బొడ్డును సరిగ్గా శుభ్రం చేసుకోరు. దీంతో ఆ ప్రాంతంలో బాక్టీరియా పేరుకుపోయి వివిధ రకాల వ్యాధులు వస్తుంటాయి. సైంటిస్టులు చెబుతున్నదేంటంటే బొడ్డులో దాదాపు 67 రకాల బాక్టీరియాలు నివాసం ఉంటాయట. ఈ క్రమంలో బొడ్డును సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే వ్యాధుల బారిన పడక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
కనీసం వారానికి ఒక సారైనా బొడ్డును శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనకు కలిగే అనారోగ్యాలను నివారించవచ్చు. బొడ్డు లోపలి భాగం పైకి ఉన్నవారు సాధారణ సబ్బుతో క్లీన్ చేసుకున్నా చాలు. కానీ బొడ్డు బాగా లోతుగా ఉన్నవారు పలు సూచనలు పాటిస్తే బొడ్డును శుభ్రంగా ఉంచుకోవచ్చు. సబ్బు నీళ్లను బొడ్డులో పోస్తూ కాటన్ బాల్స్ వంటివి పెట్టి తిప్పడం ద్వారా, క్లీనింగ్ ఆల్కహాల్ ద్వారా బొడ్డును శుభ్రం చేసుకోవచ్చు. దీంతో బొడ్డు శుభ్రంగా మారుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…