Honey And Fruits : ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే షుగర్ సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు యువత కూడా దీని బారిన పడుతున్నారు. అస్తవ్యస్తమైన జీవన విధానం వల్లే షుగర్ వస్తోంది. అధిక శాతం మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధి ఉన్నవారు ఆహారం విషయంలో ముఖ్యమైన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లు, తేనె తీసుకునే విషయంలో అనేక సందేహాలు వస్తుంటాయి. వాటికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు నిర్భయంగా పండ్లను తినవచ్చు. పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి జంకు లేకుండా పండ్లను తినవచ్చు. అయితే పండ్లను మాత్రం అతిగా తినరాదు. ఉదాహరణకు ఒక పూట 2 చపాతీలను తింటున్నారని అనుకుందాం. పండ్లను తినదలిస్తే ఒక చపాతీ చాలు. మిగిలిన చపాతీకి బదులుగా ఏవైనా పండ్లను తినండి. ఇలా డయాబెటిస్ ఉన్నవారు పండ్లను తిన్నా ఏమీ కాదు. షుగర్ లెవల్స్ పెరగవు. ఇలా మోతాదులో తినాల్సి ఉంటుంది.
ఇక కొన్ని రకాల పండ్లకు గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పండ్లను తింటే చక్కెరలు త్వరగా రక్తంలో కలుస్తాయన్నమాట. దీంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కొన్ని రకాల పండ్లు మరీ తియ్యగా ఉంటాయి. ఇలా పండ్లను తింటే షుగర్ లెవల్స్ అమాంతంగా పెరుగుతాయి. కనుక జీఐ విలువ ఎక్కువగా ఉన్న పండ్లను అయితే తినరాదు. జీఐ విలువ తక్కువగా ఉండే పండ్లను తింటే మేలు జరుగుతుంది. ఇలా డయాబెటిస్ ఉన్నవారు పలు రకాల జాగ్రత్తలను పాటిస్తూ పండ్లను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. దీంతో ఎలాంటి ఇబ్బందులు రావు.
ఇక తేనెను కూడా షుగర్ ఉన్నవారు వాడవచ్చు. కానీ రోజు మొత్తంలో తీసుకున్న కార్బొహైడ్రేట్స్ శాతం తగ్గించాలి. అందుకు బదులుగా తేనె తీసుకోవచ్చు. లేదంటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. తేనె సహజసిద్ధమైనదే. కానీ కొందరిలో షుగర్ లెవల్స్‌పై ప్రభావం చూపించవచ్చు. కనుక తేనెను వాడే ముందు డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. రోజులో తీసుకునే కార్బొహైడ్రేట్లను కాస్త తగ్గించి దానికి బదులుగా తేనెను తీసుకోవచ్చు. దీంతో ఎలాంటి ఇబ్బందులు రావు. ఇలా డయాబెటిస్ ఉన్నవారు తేనెను కూడా జాగ్రత్తలు పాటిస్తూ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ తేనె గురించి భయపడాల్సిన పనిలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…