Hair Loss With Hot Water : చాలామంది జుట్టు రాలిపోతోంది, రాలిపోతోంది అని బాధపడుతుంటారు. కానీ, చేసే పొరపాట్లు మాత్రం మర్చిపోతుంటారు. మన జుట్టు బాగుండాలంటే, మన ఆరోగ్యం కూడా బాగుండాలి అని గుర్తుపెట్టుకోండి. అలానే, ఇంకొన్ని పొరపాట్లు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. వేడినీటితో తలస్నానం చేస్తూ ఉంటారు చాలామంది. వేడి వేడి నీళ్లు ని మనం ఒంటిమీద పోసుకుంటే, చాలా హాయిగా ఉంటుంది. ఎప్పుడైనా, మనకి బాగా చెమట పట్టినప్పుడు ఒక బకెట్ వేడి నీళ్లతో స్నానం చేస్తే, ఏదో సంతృప్తి కలుగుతుంది.
తల స్నానం చేసినప్పుడు మాత్రం, ఈ విషయంలో ఆలోచించాలి. బాగా వేడి నీటిని తల మీద నుండి పోసుకోవడం వలన, జుట్టుకి అనేక రకాల సమస్యలు కలుగుతాయి అని గుర్తుపెట్టుకోండి. వేడి ఎక్కువగా ఉన్న నీళ్ళని. తల మీద పోసుకోవడం వలన ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు కూడా వేడి నీటితో తలస్నానం చేస్తే, బాడీకి ఉపశమనం వస్తుంది. కానీ, జుట్టుకు మాత్రం సమస్యలు కలుగుతాయి.

జుట్టు పొడిబారి పోతుంది. స్కాల్ప్ ని డీహైడ్రేట్ చేస్తుంది. జుట్టుకి చికాకు కూడా కలుగుతుంది. వేడి నీటిని తల మీద నుండి పోసుకుంటే, హాయిగా ఉంటుంది. కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. వేడి నీటితో తలస్నానం చేయడం వలన జుట్టు బాగా రాలిపోతుంది అని గుర్తు పెట్టుకోండి. 40 డిగ్రీల కంటే, ఎక్కువ వేడి నీళ్ళని అసలు తల మీద పోసుకోకూడదు.
గోరువెచ్చని నీటితో తల స్నానం చేయవచ్చు. మామూలుగా ఒంటి మీద నీళ్లు పోసుకున్నప్పుడు, కొంచెం వేడి నీళ్లు పోసుకోవచ్చు. కానీ, తల మీద మాత్రం బాగా ఎక్కువ వేడి తో ఉన్న నీళ్లు పోసుకోకండి. బాగా వేడి నీళ్లు పోసుకుంటే, చుండ్రు కూడా రావచ్చు. జుట్టు పెలుసుగా కూడా మారిపోవచ్చు. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాటు చేయొద్దు.