Green Juice : ప్రతిరోజు ఉదయం చాలామంది ఆరోగ్యకరమైన సూత్రాలని పాటిస్తూ, రోజుని మొదలు పెడుతూ ఉంటారు. నిజానికి ఉదయం అల్పాహారం మొదలు, రాత్రి నిద్రపోయే వరకు ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తే, ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఈసారి వీటిని మీరు అలవాటు చేసుకోండి. అప్పుడు, మీ ఆరోగ్యాన్ని మీరు పెంపొందించుకోవచ్చు. ఆకుపచ్చ జ్యూసులు తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆకుపచ్చ జ్యూస్ ని తీసుకుంటే, పోషకాలు బాగా అందుతాయి. అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
ఉదయం పూట, ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను, సరైన ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఉదయాన్నే కూరలతో, ఆకుకూరలతో చేసిన జ్యూస్ లని తీసుకుంటే, బాగా పోషకాలు అందుతాయి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, జింక్ వంటివి ఇందులో ఉంటాయి. కాబట్టి, ఇన్ని పోషక పదార్థాలని మీరు ఆకుపచ్చ డ్రింక్ తో పొందవచ్చు. ఉదయం పూట ఆకుకూరలు, కూరగాయలతో చేసిన జ్యూస్ ని తాగడం వలన అజీర్తి సమస్యలకి కూడా దూరంగా ఉండవచ్చు.

వీటిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. అలానే, గట్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అజీర్తి సమస్యలను కూడా దూరం చేయగలవు. అలానే, ఆకుపచ్చ కూరగాయలతో, ఆకుకూరలతో చేసిన డ్రింక్స్ ని తీసుకోవడం వలన బాడీ క్లీన్ అయిపోతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇంఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఈ జ్యూస్ ని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా అవుతుంది.
కూరగాయలతో, ఆకుకూరలతో తయారు చేసిన జ్యూస్ ని తీసుకుంటే, ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి అవుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు. ఇలాంటి జ్యూస్ ని ఉదయం పూట తాగడం వలన చర్మం కూడా అందంగా మారుతుంది. ఆరోగ్యంతో పాటుగా, గ్లోయింగ్ స్కిన్ కూడా మీరు పొందవచ్చు. ఇలా, అనేక లాభాలని మనం ఈ జ్యూస్ ని, తీసుకుని పొందవచ్చు.