Pimples : మొటిమలు.. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉన్నారు. స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తూ ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత, జిడ్డు చర్మం, వాతావరణ కాలుష్యం, చర్మంపైమృతకణాలు పేరుకుపోవడం వంటి కారణాల చేత మొటిమలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ మొటిమలు కొన్ని సార్లు నొప్పిని కూడా కలిగిస్తూ ఉంటాయి. అలాగే మొటిమలు ఏర్పడిన చోట మచ్చలు, గుంతలు పడుతూ ఉంటాయి. ముఖంపై మొటిముల రావడం వల్ల మనకు ఎటువంటి నష్టం కలగదు. అయితే వీటి వల్ల ముఖం అందవిహీనంగా కనబడుతుంది. కనుక మొటిమలను తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల ఫేస్ వాష్ లను వాడుతూ ఉంటారు.
అయితే ఒక చక్కటి చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా ముఖంపై వచ్చే మొటిమలను అలాగే వాటి వల్ల కలిగే మచ్చలను, గుంతలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గాను నల్ల మట్టిని తీసుకోవాలి. తరువాత దీనిని మెత్తగా నలగొట్టి జల్లించాలి. ఇలా జల్లించగా వచ్చిన మెత్తని మట్టిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పసుపు వేసి కలపాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ నల్లమట్టిని ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా ఆరిన తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. నల్లమట్టిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం చల్లబడుతుంది. చర్మం చల్లబడడం వల్ల ముఖానికి రక్తం చక్కగా సరఫరా అవుతుంది.
అలాగే ముఖ చర్మంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది. ఈ విధంగా ముఖానికి మట్టితో ప్యాక్ ను వేసుకోవడం వల్ల మొటిమల సమస్య క్రమంగా తగ్గుతుంది. అలాగే ఈచిట్కాను పాటించడంతో పాటు నీటిని ఎక్కువగా తాగాలి. తాజా పండ్లతో చేసిన జ్యూస్ లను ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ను నీటిలో నానబెట్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల వల్ల కలిగే గుంతలు త్వరగా తొలగిపోతాయి. వీటితో పాటు మొటిమలను గిల్లకూడదు. వాటంతట అవి పగిలే వారకు వాటిని ముట్టుకోకూడదు. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా మొటిమల సమస్య నుండి బయటపడవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…