Dry Grapes : ద్రాక్ష పండ్లను ఎండ బెట్టి తయారు చేసే ఎండు ద్రాక్ష (కిస్ మిస్) అంటే చాలా మందికి ఇష్టమే. వీటినే కిస్ మిస్ పండ్లని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువగా స్వీట్లు, తీపి వంటకాల తయారీలో అందరూ ఉపయోగిస్తారు. అయితే ఈ ఎండు ద్రాక్షలను కొన్నింటిని తీసుకుని రాత్రిపూట నీటిలో నానబెట్టి వాటిని ఉదయాన్నే తింటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ప్రధానంగా పలు రకాల అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు ద్రాక్షల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. పైన చెప్పినట్టుగా నిత్యం కొన్ని ఎండు ద్రాక్షలను తింటుంటే దాంతో రక్తం బాగా తయారవుతుంది.
విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు కిస్ మిస్ పండ్లలో ఉంటాయి. ఇవి గుండె సంబంధ వ్యాధులకు అడ్డుగోడగా నిలుస్తాయి. ఉదయాన్నే ఎండు ద్రాక్షలను తినడం వల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. ఉద్యోగులకు, పిల్లలకు కిస్ మిస్ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. రక్తంలో ఉన్న చెడు కొలెస్టరాల్ తగ్గుతుంది. అధిక బరువు ఉన్న వారు నిత్యం కొన్ని కిస్ మిస్ పండ్లను తింటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
ఉదయాన్నే ఎండు ద్రాక్షలతోపాటు కొన్నివెల్లుల్లి రెబ్బల్ని పచ్చిగా అలాగే తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ నుంచి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు పరిష్కారమవుతాయి. మలబద్దకం తొలగిపోతుంది. గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి. ఎండుద్రాక్షలో యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వైరల్ జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లతో బాధ పడే వారు కిస్ మిస్ పండ్లను తింటుంటే త్వరగా కోలుకుంటారు. ఇలా కిస్‌మిస్‌లను రోజూ తింటే మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…