Drumstick Leaves : ఏదైనా స్వల్ప అనారోగ్యం కలిగిందంటే చాలు మెడికల్ షాపుకో, ఆస్పత్రికో పరుగెత్తడం, మందులను వాడడం నేడు ఎక్కువైపోయింది. కానీ మీకు తెలుసా..? ఎలాంటి అనారోగ్యానికైనా మన చుట్టు పక్కల ఉండే మొక్కలు, వృక్షాల్లో ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుందని.. అవును, మీరు విన్నది నిజమే. అలాంటి చెట్లలో ఒకటే మునగ చెట్టు. దీనికి చెందిన ఆకుల్లో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు మనకు కలిగే స్వల్ప అనారోగ్యాలను మాత్రమే కాదు, పలు రకాల మొండి వ్యాధులను కూడా నయం చేయగలుగుతాయి. ఈ క్రమంలో మునగాకు వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగ చెట్టు ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్ బి6, విటమిన్ ఎ, ప్రోటీన్లు, విటమిన్ బి2, ఐరన్, మెగ్నిషియం వంటి ముఖ్యమైన పోషక పదార్థాలు మునగ ఆకుల్లో పుష్కలంగా ఉన్నాయి. నిత్యం మునగ ఆకును మన ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ముందు చెప్పిన పోషకాలన్నీ మనకు అందుతాయి. మునగ చెట్టు ఆకులను నిత్యం కూర, లేదా రసం రూపంలో ఏదో ఒక విధంగా తీసుకున్నట్టయితే దాంతో శరీరానికి కాల్షియం, ఐరన్ పుష్కలంగా అందుతాయి. దీంతో ఎముకలకు బలం చేకూరుతుంది. అవి దృఢంగా మారుతాయి.
మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్‌లు దూరమవుతాయి. క్యాన్సర్ కణజాలాల పెరుగుదలను అడ్డుకుంటాయి. విటమిన్ సి, బీటా కెరోటిన్‌లు కూడా ఉండడం వల్ల క్యాన్సర్ కారక పదార్థాలు నాశనమవుతాయి. మునగ చెట్టు వేళ్లను తీసుకుని బాగా కడిగి వాటిని జ్యూస్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం బెల్లంతోపాటు తీసుకుంటుంటే తలనొప్పి మాయమవుతుంది. కొన్ని మునగ ఆకులను తీసుకుని పేస్ట్‌లా చేసి దానికి కొంత తేనెను కలిపి కంటి రెప్పలపై పెట్టుకుంటే నేత్ర సంబంధ సమస్యలు తొలగిపోతాయి. దృష్టి బాగా ఉంటుంది. కంటి వాపు కూడా తగ్గుతుంది. కురుపులు నయమవుతాయి.
మునగ చెట్టు ఆకులను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని నిత్యం 7 గ్రాముల మోతాదులో ఉదయాన్నే పరగడుపున తాగాలి. దీంతో మధుమేహం ఉన్న వారి రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. షుగర్ కంట్రోల్ అవుతుంది. మునగ చెట్టు ఆకుల్లో సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులకు చెందిన రసాన్ని నిత్యం కొంత మోతాదులో తాగుతున్నట్టయితే రక్తం శుద్ధి అవుతుంది. అందులో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. చర్మ సంబంధ సమస్యలు కూడా నయమవుతాయి. మునగాకు రసాన్ని తాగితే వృద్ధాప్యం కారణంగా శరీరంపై వచ్చే ముడతలు పోతాయి. యాంటీ ఏజింగ్ గుణాలు ఈ ఆకుల్లో పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల వయస్సు మీద పడుతున్నా యవ్వనంగా కనిపిస్తారు. ఇలా మునగ ఆకులతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…