Beer : ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఎండలు మరింత ముదరనున్నాయి. ఈ క్రమంలో మండుతున్న ఎండలు, వేడితో జనాలు అల్లాడిపోతున్నారు. అందుకే కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఇక అత్యవసర స్థితి ఉంటే తప్ప ఎవరూ బయటికి రావడం లేదు. వచ్చినా చల్లని మార్గాల వైపు చూస్తున్నారు. అందుకనే చాలా మంది తమ శరీరాలను చల్లగా ఉంచుకోవడం కోసం శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ వంటివి తాగుతున్నారు. అయితే మద్యం ప్రియులు ఎండల్లో విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కా కన్నా బీర్ తాగేందుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఎందుకంటే చల్ల చల్లని బీర్ తాగితే శరీరం చల్లగా ఉంటుందని వారు అనుకుంటారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది ? నిజంగానే బీర్ తాగితే శరీరం చల్లబడుతుందా ? వేసవిలో బీర్ తాగవచ్చా ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీర్ కూడా ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్‌లాగే ఉంటుంది. కాకపోతే అందులో ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో చల్లని బీర్‌ను తాగితే అందులో ఉండే ఆల్కహాల్ వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అంటే ఒంట్లో ఉన్న నీరు అంతా బయటకు పోతుంది. అయితే వేసవిలో సహజంగానే మన శరరీంలో ఉండే నీరు డీహైడ్రేషన్ వల్ల బయటకు వెళ్లిపోతుంది. దీంతో మనకు దాహం అవుతుంది. అదే ఈ కాలంలో ఇక బీర్ కాదు, ఏ ఇతర ఆల్కహాలిక్ డ్రింక్ తాగినా సరే.. డీహైడ్రేషన్ మరింత ఎక్కువవుతుంది. దీంతో మన శరీరంలో ఉండే నీరు ఇంకా త్వరగా బయటకు పోతుంది. అది మనకు అస్సలు మంచిది కాదు. కనుక వేసవిలో బీర్ కాదు, ఇతర ఏ ఆల్కహాలిక్ డ్రింక్‌ను తాగకుండా ఉండడమే బెటర్.
ఇక చాలా మంది చల్లని నీళ్లను తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది అనుకుంటారు. కానీ చల్లదనం కేవలం మన దాహం మాత్రమే తీరుస్తుంది. శరీరాన్ని చల్ల బరచదు. కానీ జీర్ణాశయంలో ఎలాంటి అలజడి లేకుండా చేస్తుంది. అయితే శరీరం చల్లబడాలంటే నీళ్లకు బదులుగా కొబ్బరి నీళ్లను తాగితే ఇంకా మంచిది. వేసవిలో మనకు వేడి ఎక్కువగా చేస్తుంది కనుక ఆ వేడి తగ్గాలంటే నీళ్లు సరిపోవు. కానీ కొబ్బరి నీళ్లను తాగితే వేడి ఇట్టే దిగిపోతుంది. కనుక ఈ సీజన్‌లో కొబ్బరి నీళ్లను తాగాల్సి ఉంటుంది. కాబట్టి శరీరంలో వేడి ఉన్నవారు రోజూ కొబ్బరి నీళ్లను తాగితే ఎంతో మేలు జరుగుతుంది. దీంతోపాటు పుచ్చకాయలు, తర్బూజా వంటివి కూడా మేలు చేస్తాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…