Kidneys Clean : మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపివేయడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరం సక్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు నిరంతరాయంగా తమ విధులను నిర్వహిస్తూనే ఉండాలి. నిత్యం ఎన్నో రకాల లవణాలు, విష పదార్థాలను కిడ్నీలు వడపోత పోసి బయటకు పంపివేస్తూనే ఉంటాయి. అయితే కింద పేర్కొన్న ఓ సహజ సిద్ధమైన పానీయంతో కిడ్నీలను ఇన్‌స్టాంట్‌గా వెంటనే శుభ్రం చేసుకునేందుకు వీలుంటుంది. ఆ పానీయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజా, శుభ్రమైన కొత్తిమీర ఆకులను కొన్నింటిని తీసుకోవాలి. వాటిని పెద్ద ముక్కలుగా కత్తిరించాలి. ఒక పాత్రలో నీటిని తీసుకుని దాంట్లో కత్తిరించిన ఆకులను వేసి నానబెట్టాలి. కొంత సేపటి తరువాత వాటిని అదే నీటితో స్టవ్‌పై 10 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం స్టవ్ నించి దింపిన పాత్రపై ఒక మూత పెట్టి లోపలి ద్రవాన్ని చల్లారనివ్వాలి. ద్రవం చల్లారాక దాన్ని శుభ్రమైన గుడ్డతో వడకట్టాలి. దీన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. మోతాదుకి ఒక గ్లాస్ చొప్పున నెలకు రెండు సార్లు ఈ పానీయాన్ని సేవించాలి. దీన్ని తీసుకున్న తరువాత వచ్చే మూత్రం రంగు మారి ఉంటుంది. అంటే మీ శరీరంలో నుంచి వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతున్నాయన్నమాట.
ఈ పానీయంతోపాటు రోజులో వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకుంటే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది. మహిళలకు రుతు సమయంలో కలిగే నొప్పులను తొలగించడంలో ఈ పానీయంగా బాగా పనిచేస్తుంది. అయితే కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతున్న వారు మాత్రం ఈ పానీయాన్ని తాగకూడదు. ఎందుకంటే వాటిని ఈ పానీయం మరిన్ని ఇబ్బందులు పెడుతుంది. గర్భిణీలు దీన్ని తాగాలనుకుంటే ముందుగా వైద్యున్ని సంప్రదించాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…