Biryani : మనం తీసుకునే ఆహారం పట్ల కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. మనం ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తే మన ఆరోగ్యం అనవసరంగా దెబ్బతింటుంది. కొన్ని రకాల తప్పులు చేయడం వలన అనవసరంగా నష్టపోవాల్సి వస్తుంది. రాత్రిపూట తీసుకునే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి. రాత్రి పూట త్వరగా తినడం మంచిది. రోజూ రాత్రిళ్ళు త్వరగా భోజనం చేసేయాలి. అప్పుడే జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయగలదు. బరువు కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని కూడా సరిగ్గా ఉంచవచ్చు.
రాత్రిపూట ఆలస్యంగా తింటే ఊబకాయం, అధిక రక్తపోటు, షుగర్ వంటి వాటికి దారి తీస్తుంది. కాబట్టి రాత్రిళ్ళు ఎంత త్వరగా అయితే అంత త్వరగా తినేసి నిద్రపోవడం మంచిది. ఆరోగ్య నిపుణుల ప్రకారం రాత్రి 7:00 గంటలకి ముందు భోజనం చేయాలి. రాత్రిళ్ళు సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. లిమిట్ గా ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి పూట జీవక్రియ తక్కువగా ఉండడం వలన ఎక్కువ ఆహారం తీసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకని ఆ తప్పు చేయకండి.
అదనపు కేలరీలు కొవ్వులో పేరుకుపోవడం మొదలుపెడతాయి. కాబట్టి రాత్రిళ్ళు త్వరగా తినడం తేలికగా తినడం చాలా అవసరం. రాత్రిపూట బిర్యానీ వంటివి తీసుకోకూడదు. అధికంగా కొవ్వు కలిగిన ఆహార పదార్థాలని రాత్రిళ్ళు తీసుకోవడం వలన శరీరంలో కొన్ని భయంకరమైనవి చోటు చేసుకుంటాయి. రాత్రిపూట గుడ్డు పచ్చ సొన తింటే కూడా మంచిది కాదు. రాత్రిపూట ఎక్కువ తింటే, పిత్తాశయ రాళ్లు ఉన్నవారిలో తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
రాత్రిపూట ఎక్కువగా తినడం వలన నిద్రకి కూడా ఆటంకం కలుగుతుంది. బాగా నిద్రపోలేరు. దీంతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. రాత్రిపూట ఎక్కువగా తింటే గుండె అసాధారణంగా కొట్టుకుంటుంది. హృదయ స్పందన రేటు పెరిగిపోతుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాత్రిపూట ఎక్కువగా తినడం వలన జీర్ణకోశ సమస్యలు వస్తాయి. పొట్టలో పుండ్లు, పేగుల్లో మంట, మలబద్ధకం ఇలాంటివి కలగవచ్చు. కాబట్టి, రాత్రిళ్ళు ఎక్కువ ఆహార పదార్థాలను తీసుకోకండి. లైట్ గా తీసుకోండి. త్వరగా తీసుకోండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…