Banana : అరటిపండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అరటిపండును తీసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు. చాలా సమస్యలకి అరటి పండుతో దూరంగా ఉండవచ్చు. పోషకాలు కూడా అరటిపండ్లలో ఎక్కువగా ఉంటాయి. అరటి పండ్లను తీసుకుంటే ఎన్నో సమస్యలు లేకుండా ఉండవచ్చు. అరటి పండ్లను తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లను తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఒక మీడియం సైజ్ అరటిపండును తీసుకున్నట్లయితే రోజులో కావాల్సినంత ఫైబర్ మనకి అందుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఏమీ ఉండవు. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి బాధలు కూడా ఉండవు. యాసిడ్ ఉత్పత్తి అవ్వకుండా కూడా ఇది చూస్తుంది. బీపీని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది.

అరటి పండ్లను తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండదు. గర్భిణీలు కూడా అరటి పండ్లను తీసుకోవచ్చు. అయితే అల్పాహారం సమయంలో మాత్రం అరటి పండ్లను తీసుకోవడం మంచిది కాదు. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న అరటి పండ్లను ఎందుకు అల్పాహారంలో తీసుకోకూడదు..? ఈ విషయానికి వస్తే, అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా, 25 శాతం షుగర్ వాటిలో ఉంటుంది.
దీంతో మధ్యాహ్నం అయ్యే సరికి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. బాగా ఎక్కువ ఆకలి వేయడం, అలసిపోయినట్లుగా ఉండడం ఇలా మంచి కన్నా చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. పైగా షుగర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. అరటిపండును తినడం వలన క్రేవింగ్స్ పెరిగిపోతాయి. అధికంగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అరటిపండుకి బదులుగా ఒక గ్లాసు పాలు లేదంటే పీనట్ బటర్, ఉడికించిన గుడ్డు వంటివి తీసుకోండి. ఇలా మీరు అరటిపండును తీసుకోకపోయినట్లయితే పలు సమస్యలకు దూరంగా ఉండవచ్చు.