Salts : కూరల్లో ఉప్పే ప్రధానం. ఉప్పు లేని కూరను ఎవ్వరూ తినలేరు. ఉప్పు లేకపోయినా.. ఉప్పు ఎక్కువైనా కూడా ముద్ద దిగదు. ఉప్పుకు కూరల్లో ఉన్న ప్రాధాన్యత అంత ఉంటుంది. కారం ఎక్కువైనా.. పసుపు ఎక్కువైనా.. తక్కువైనా ఎలాగోలా తినేయొచ్చు కానీ.. ఉప్పు లేకపోతే వెంటనే ఉప్పు చల్లుకొని మరీ తినేస్తాం. అది ఉప్పుకు ఉన్న ప్రాముఖ్యత. అయితే.. చాలామందికి ఏ ఉప్పు వాడాలో తెలియదు. రోజుకు ఎంత వాడాలో కూడా తెలియదు. మన శరీరానికి అవసరమైన ఉప్పును వాడకపోవడం వల్ల.. ఏ ఉప్పు వాడాలో తెలియకపోవడం వల్ల.. ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
నిజానికి.. మన శరీరానికి ఉప్పు ఎంతో అవసరం. కానీ.. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఉప్పులో సోడియం, క్లోరైడ్ ఉంటాయి. వీటి వల్ల నరాల పనితీరు మెరుగుపడుతుంది. కణాల్లో, రక్తంలో ఉండే నీటి శాతాన్ని ఉప్పు నియంత్రిస్తుంది. కాకపోతే.. రోజూ 6 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు. 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును రోజూ తీసుకుంటే.. శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. దాని వల్ల కాళ్లు, చేతుల్లో వాపు వస్తుంది. బీపీ పెరుగుతుంది.
ఒకవేళ ఉప్పును ఎక్కువగా కొన్నేళ్ల పాటు తీసుకుంటే.. జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. హైబీపీతో పాటు.. గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అలాగని.. ఉప్పును పూర్తిగా మానేసినా కూడా సమస్యే. అందుకే.. రోజుకు కనీసం 6 గ్రాముల ఉప్పును మీ ఆహారంలో భాగం చేసుకోండి.సాధారణంగా.. ఎక్కువ మంది మార్కెట్ లో దొరికే అయోడైజ్డ్ సాల్ట్ ను వాడుతుంటారు. కానీ.. అది ఆర్టిఫిషియల్ గా అయోడిన్ కలిపిన ఉప్పు. అలాగే.. అది ప్రాసెస్ చేసిన ఉప్పు. ఆ ఉప్పు తినడం వల్ల ఉన్న రోగాలు పోయి.. వేరే రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.
అందుకే.. ఎక్కువ శాతం.. సముద్రపు ఉప్పు, గళ్ల ఉప్పు, రాళ్ల ఉప్పును వాడటం మంచిది. వాటిలో సహజసిద్ధంగా అయోడిన్ ఉంటుంది. అలాగే సైంధవ లవణాన్ని కూడా కూరల్లో వేసుకోవడానికి వాడుకోవచ్చు. కానీ.. అయోడైజ్డ్ ఉప్పు పేరుతో అమ్మేవాటిని తినడం వల్ల లేనిపోని సమస్యలను అయితే కొని తెచ్చుకున్నట్టే అవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…