Cumin Water : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. చాలామంది, ఉదయం లేవగానే మంచినీళ్ళని తాగుతూ ఉంటారు. రెండున్నర నుండి మూడు లీటర్ల వరకు లేచిన వెంటనే, చాలామంది నీళ్లు తీసుకుంటూ ఉంటారు. చాలామందికి, ఇది ఎప్పటి నుండో ఉన్న అలవాటు. కొంతమందికి మాత్రం ఉదయం లేవగానే నీళ్లు తాగడం అస్సలు నచ్చదు.
ఉదయం లేవగానే నీళ్లు తాగితే కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది. సో, అటువంటి వాళ్ళు ఈ పద్ధతిని పాటించవచ్చు. నీళ్లు తాగలేని వారు కావాలంటే జీరా వాటర్ తీసుకోవచ్చు. జీరా వాటర్ ని తీసుకోవడం వలన, ఫ్లేవర్ మారుతుంది. కాబట్టి, నోటికి రుచిగా ఉంటుంది. జీరా వాటర్ ని ఉదయాన్నే తీసుకుంటే, ఏ లాభాలని పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జీలకర్ర వేసి కొన్ని నీళ్లు పోసి, మరిగించి ఆ జీలకర్రని వడగట్టేసి ఆ జీలకర్ర నీళ్లు తాగండి. చాలా టేస్టీగా ఉంటుంది.

పైగా లాభాలూ ఉంటాయి. డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా సెక్రీట్ అవ్వడమే కాకుండా, డైజెస్టివ్ సిస్టం పవర్ ఫుల్ గా ఉంటుంది. లోపల గ్యాస్ ఫార్మ్ అవ్వకుండా, ఫ్రీగా పేగుల్లో ఆహారాలు జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. జీలకర్ర అజీర్తి సమస్యలను పోగొడుతుంది. ఈ జీరా వాటర్ ని తీసుకుంటే, మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది. బరువు తగ్గడానికి, కొవ్వుని కరిగించడానికి కూడా జీరా వాటర్ బాగా ఉపయోగపడతాయి.
మామూలు నీళ్ళని పరగడుపున ఎవరైనా తాగలేకపోతున్నట్లయితే, రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల వరకు మంచినీళ్లు తీసుకోవాలి. కాబట్టి, వాటిని తీసుకోలేకపోతే జీలకర్ర వాటర్ తీసుకోండి. ఈ అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రకరకాల బాధల నుండి మనకి ఉపశమనం కూడా కలుగుతుంది. కాబట్టి, ఇలా డైలీ ఫాలో అయిపోవడం మంచిది.