Chironji Seeds : చిరోంజీని ఎక్కువగా స్వీట్స్ లో వాడతారు. అలాగే బాదంపప్పులకు ప్రత్యామ్నాయంగా వాడుతూ ఉంటారు. వీటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి బాదం పప్పు రుచిని కలిగి ఉంటాయి. వీటిని పచ్చిగా తినవచ్చు.. లేదంటే వేయించి కూడా తినవచ్చు. ఈ గింజలలో ప్రోటీన్, ఫైబర్ చాలా సమృద్దిగా ఉంటాయి. అలాగే విటమిన్ B1, B2, C, నియాసిన్, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం వంటివి సమృద్దిగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి.
అందువల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణ సంబంద సమస్యలను తగ్గిస్తాయి. ఈ గింజల్లో సమృద్ధిగా ఉండే ఖనిజాలు, విటమిన్లు చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ గింజల పొడిని పాలల్లో కలిపి ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన చర్మం మీద మృత కణాలు, మురికి తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. అందుకే ఈ గింజలను సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు.
ఈ గింజలలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండడం వలన గాయాలను నయం చేసుకోవచ్చు. అలాగే నోటి పూతల చికిత్సకు సహాయపడుతుంది. చిరోంజి గింజలు జీర్ణ సమస్యలకు చికిత్స చేయడంతోపాటు శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది అల్సర్ల చికిత్సకు దోహదం చేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడి డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది. ఆవనూనెలో చిరోంజి గింజల పొడి కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పులు తగ్గుతాయి. ఇలా ఈ గింజలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…