Cardamom For Beauty : మన భారతీయుల వంట గదుల్లో ఉండే మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులు చక్కటి వాసనను, రుచిని కలిగి ఉంటాయి. దాదాపు మనం చేసే అన్ని రకాల తీపి వంటకాలు, మసాలా వంటకాల్లో ఈ యాలకులను వాడుతూ ఉంటాము. మనం చేసే వంటలకు మంచి వాసనను, రుచిని తీసుకురావడంలో యాలకులు చక్కటి పాత్ర పోషిస్తాయి. అలాగే యాలకులను తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా నోటి దుర్వాసనను తగ్గించడంలో ఇవి చక్కగా పని చేస్తాయి. అయితే మన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా యాలకులు ఎంతో మేలు చేస్తాయి. యాలకులను వాడడం వల్ల మనం చక్కటి అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.
అయితే యాలకులను ముఖ సౌందర్యం పెంచుకోవడానికి ఎలా వాడాలి.. వీటిని వాడడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 10 యాలకులను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో తేనె, పాలు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు తగ్గుతాయి. అలాగే యాలకుల పొడిలో పెరుగు, శనగపిండి కలిపి ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గిపోతాయి. చర్మం పొడిబారకుండా ఉంటుంది. చర్మంపై ఉండే మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం అందంగా తయారవుతుంది. అలాగే యాలకుల నీటిని వాడడం వల్ల కూడా మనం చక్కటి అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.
దీని కోసం గిన్నెలో 5 నుండి 10 యాలకులు వేసి నీరు పోసి ఉడకబెట్టాలి. యాలకులు లేత రంగులోకి వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీళ్లు కొద్దిగా చల్లారిన తరువాత ఈ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ నీటిని టోనర్ గా కూడా వాడవచ్చు. అలాగే ఈ నీటిని వివిధ రకాల ఫేస్ ప్యాక్ లల్లో కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా యాలకులను వాడడం వల్ల మనం అందమైన, కాంతివంతమైన, మచ్చలు లేని చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…