ఆరోగ్యం

Buffalo Vs Cow Milk : ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు తాగితే మంచిదో తెలుసా..?

Buffalo Vs Cow Milk : పాలు సంపూర్ణ పౌష్టికాహారం. అందులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీంతో మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ అందుతుంది. అందుకే పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారం అంటారు. పాల‌లో ఉండే విటమిన్ డి, కాల్షియం మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కాలు. వీటి వ‌ల్ల ఎముక‌లు బ‌లంగా, దృఢంగా మార‌డ‌మే కాదు, శ‌రీర పెరుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. బ‌రువు అదుపులో ఉంటుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అయితే పాలు అన‌గానే మ‌న‌కు రెండు ర‌కాల పాలు గుర్తుకు వ‌స్తాయి, అవి ఒక‌టి గేదె పాలు. రెండు ఆవు పాలు. కొంద‌రు ఆవు పాల‌ను తాగేందుకు ఇష్టం చూపిస్తే కొంద‌రు గేదె పాలు మాత్ర‌మే తాగుతారు. మ‌రి నిజానికి మ‌న‌కు ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..? ఎలాంటి శ‌రీర తత్వం ఉన్న‌వారు ఏ పాలు తాగితే మంచిది..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గేదె పాల‌కు, ఆవు పాల‌కు ప‌లు ముఖ్య‌మైన తేడాలు ఉంటాయి. అవేమిటంటే.. ఆవు పాలు చాలా లైట్‌గా ఉంటాయి. త‌క్కువ ఫ్యాట్‌ను క‌లిగి ఉంటాయి. త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. అందుకే వాటిని శిశువుల‌కు తాగిస్తారు. ఇక గేదె పాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. వీటిలో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంది. గేదె పాల‌ను ఎక్కువ‌గా ప‌న్నీర్‌, ఖీర్‌, కుల్ఫీ, పెరుగు, నెయ్యి త‌యారీలో వాడుతారు. ఆవు పాల‌తో ర‌స‌గుల్లా, ర‌స‌మ‌లై వంటివి చేస్తారు. ఇక ఆవు పాలు కేవ‌లం 1, 2 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. గేదె పాల‌ను ఎన్ని రోజులైనా నిల్వ ఉంచవ‌చ్చు.

Buffalo Vs Cow Milk

గేదె పాల‌లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. కొవ్వు కూడా ఎక్కువే. అందువ‌ల్లే గేదె పాల‌తో మ‌న‌కు ల‌భించే క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి. ఆవు పాల‌లో నీరు ఎక్కువ‌గా ఉంటుంది. 90 శాతం నీటిని ఆవు పాలు క‌లిగి ఉంటాయి. దీంతో ఆవు పాల ద్వారా మ‌నకు ల‌భించే క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. గేదె పాల‌లో కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, మెగ్నిషియం, పొటాషియం ఎక్కువ‌గా ఉంటాయి. ఆవు పాల‌లో ఇవి కొంత త‌క్కువ‌గా ఉంటాయి. ఇక మ‌రి ఈ రెండు ర‌కాల పాల‌లో ఏవి తాగితే బెట‌ర్ అంటే..

అధిక బ‌రువు ఉన్న‌వారు ఆవు పాల‌ను తాగ‌డం బెట‌ర్‌. ఎందుకంటే క్యాల‌రీలు త‌క్కువ‌గా ల‌భిస్తాయి. దీనికి తోడు పోష‌కాలు కూడా అందుతాయి. క‌నుక అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. స‌న్న‌గా ఉన్న‌వారు, జీర్ణ శ‌క్తి అధికంగా ఉన్న‌వారు నిక్షేపంగా గేదె పాలు తాగ‌వ‌చ్చు. వ్యాయామం రోజూ చేసేవారు కూడా గేదె పాల‌ను తాగ‌వ‌చ్చు. జీర్ణ‌శ‌క్తి అంతగా లేని వారు ఆవు పాల‌ను తాగితే బెట‌ర్‌. దాంతో మంచి పోష‌కాలు అందుతాయి. ఇలా వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తమ శ‌రీర త‌త్వాల‌కు అనుగుణంగా ఆవు పాలు లేదా గేదె పాల‌ను తాగాల్సి ఉంటుంది. దీంతో అన్ని విధాలుగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వచ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM