Bean Flour For Hair : శనగపిండితో అనేక లాభాలని పొందొచ్చు. శనగపిండి అందాన్ని పెంపొందిస్తుంది. శనగపిండి చుండ్రు మొదలైన సమస్యల్ని కూడా తొలగించగలదు. చాలామందికి ఈ విషయం తెలియదు. శనగపిండి కేవలం ఆరోగ్యానికి, అందానికి మాత్రమే అని అనుకుంటారు. కానీ శనగపిండి వలన జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి బాధల నుండి కూడా బయటపడొచ్చు. చాలామంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి, అనేక రకాల ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు.
వాటి కంటే మనం ఇంటి చిట్కాలతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పైగా, తక్కువ ఖర్చు అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగవు. ఇంట్లో ఉండే ఈ పదార్థాలతోనే సులభంగా మనం జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి బాధల నుండి బయటపడొచ్చు. అది కూడా ఎక్కువ పదార్థాలు కాదు. కేవలం రెండే పదార్థాలు.
పెరుగు, శనగపిండి రెండు కూడా మన ఇంట్లో ఉండేవే. ఈ రెండింటితో మనం కుదుళ్ళని బలంగా మార్చుకోవచ్చు. ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో మూడు స్పూన్ల దాకా శనగపిండి వేసుకోండి. దీనంతటిని బాగా మిక్స్ చేసి, జుట్టు పై నుండి కింద వరకు బాగా పట్టించండి. ఐదు నిమిషాలు దాకా మసాజ్ చేస్తూ ఉండండి.
అరగంట పాటు వదిలేయండి. ఆ తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయండి. ఇలా చేస్తే చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి బాధలు ఏమీ వుండవు. వారానికి రెండుసార్లు రిపీట్ చేస్తూ ఉండండి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. చనిపోయిన చర్మ కణాలని ఇది తొలగిస్తుంది. మాడుని శుభ్రపరుస్తుంది. పెరుగు లో మంచి ప్రోటీన్ కుదుళ్ళకి బలాన్ని ఇస్తుంది. శనగ పిండి కూడా అందమైన కురులని ఇస్తుంది. ఇలా సులభంగా ఈ రెండింటితో మనం అందమైన కురులని పొందవచ్చు. జుట్టు కూడా రాలదు. చుండ్రు కూడా తగ్గుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…