Bachali Kura : బచ్చలి ఆకు ఎక్కువగా పల్లెటూర్లలో కనిపిస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుకూరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్, విటమిన్ ఎ, బి, సి, ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వారంలో రెండు సార్లు ఈ ఆకుకూరను తీసుకుంటే మంచిది. బచ్చలి ఆకులో ఉన్న పోషకాలు కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
అలాగే ఈ ఆకుల్లో ఉండే రెటినోల్ కంటి కండరాల బలహీనతను తగ్గించి కంటి చూపు పెరగటానికి, వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలను తగ్గించడానికి పనిచేస్తుంది. బచ్చలికూరను ఆహారంగా తీసుకోవటం వల్ల రక్త ప్రవాహం మెరుగవుతుంది. రక్తపోటును తగ్గించటంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించటంలో సైతం ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు మెదడు డ్యామేజి కాకుండా కాపాడతాయి. క్యాల్షియం సమృద్ధిగా ఉండటం వలన కీళ్లనొప్పులు లేకుండా చేస్తుంది.
ఇందులోని పీచు జీర్ణశక్తిని పెంచి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. రక్త హీనత సమస్యతో బాధపడే వారు బచ్చలి కూర తినటం వల్ల చాలా తక్కువ సమయంలోనే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. ఇందులో ఉండే ఐరన్ రక్తాన్ని వృద్ధి చేయటంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు వారానికి మూడుసార్లు ఈ కూరను తీసుకోవటం ఆరోగ్యపరంగా మంచిది.
బచ్చలి కూరలో విటమిన్-ఎ, లుటిన్, కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన మెదడు నిర్మాణాత్మక, క్రియాత్మక నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బచ్చలి కూరను తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రసం లేదా స్మూతీ రూపంలో బచ్చలికూరను ఆహారంలో తీసుకోవడం వల్ల అధిక మోతాదులో పోషకాలు లభిస్తాయి. ఈ ఆకు కూరను తినడం వల్ల ఇలా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…