ఆరోగ్యం

Snoring : గుర‌క స‌మ‌స్య‌ను పోగొట్టుకునేందుకు 11 అద్భుత‌మైన చిట్కాలు..!

Snoring : నిద్ర పోయేట‌ప్పుడు చాలా మందికి గుర‌క వ‌స్తుంటుంది. అయితే గుర‌క పెట్టేవారికి ఏమీ అనిపించ‌దు, తెలియ‌దు. కానీ వారి ప‌క్కన పడుకునే వారికి మాత్రం అది బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అస్స‌లు నిద్ర ప‌ట్ట‌దు. ఈ క్రమంలో గుర‌క స‌మ‌స్య ఉన్న‌వారు కింద సూచించిన విధంగా ప‌లు టిప్స్ పాటిస్తే చాలు, దాంతో గుర‌క సమస్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దామా.

1. ఇంట్లో పొడి వాతావ‌ర‌ణం ఉన్నా అది గుర‌కకు దారి తీస్తుంది. ఎలా అంటే పొడి గాలి వల్ల ముక్కు రంధ్రాలు, గొంతు ఎండిపోయి వాటిలో గాలి ప్ర‌వేశించ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. అందుకే గుర‌క వ‌స్తుంది. దీన్ని ఎలా అధిగ‌మించాలంటే.. ఓ హ్యుమిడిఫైర్‌ను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవాలి. దీంతో ఇంట్లో గాలి తేమ‌గా మారి గుర‌క స‌మ‌స్య పోయేలా చేస్తుంది.

2. అధికంగా బ‌రువున్న వారు కూడా ఎక్కువ‌గా గుర‌క పెడుతుంటారు. బ‌రువు త‌గ్గితే గుర‌క త‌గ్గేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. ఎక్కువ పొట్ట ఉన్న‌వారు కూడా గుర‌క పెడ‌తారు. క‌నుక ఆ పొట్ట త‌గ్గే మార్గం చూస్తే మంచిది. దీంతో గుర‌క స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది.

3. నిత్యం యోగా, ప్రాణాయామం చేయాలి. దీంతో శ్వాస స‌మ‌స్య‌లు సెట్ అవుతాయి. గుర‌క త‌గ్గుతుంది.

4. పై ద‌వ‌డ‌ను అలాగే ఉంచి కింది ద‌వ‌డ‌ను ముందుకు తేవాలి. అనంత‌రం 10 అంకెలు లెక్క‌బెట్టాలి. ఇలా రోజుకు 7 నుంచి 10 సార్లు చేస్తే గుర‌క స‌మ‌స్య త‌గ్గుతుంది.

Snoring

5. ప‌లికేందుకు క‌ష్ట సాధ్య‌మైన ప‌దాల‌ను నిత్యం 10 నుంచి 20 సార్లు ప‌ల‌కాలి. దీంతో గుర‌క స‌మ‌స్య పోతుంది.

6. నాలుక‌ను బ‌య‌ట‌కు పెట్టి స్ట్రెయిట్‌గా ఉంచి కింద‌కు, పైకి, ఎడ‌మ‌కు, కుడికి తిప్పాలి. ఇలా రోజుకు 2 నుంచి 4 సార్లు చేస్తే గుర‌క స‌మ‌స్య పోతుంది.

7. పొగ తాగ‌డం, మ‌ద్యం సేవిండం వంటి అల‌వాట్లు ఉన్న‌వారు మానేయాలి. వాటి వ‌ల్ల కూడా గుర‌క వ‌స్తుంది. ముఖ్యంగా నిద్రించ‌డానికి ముందు ఈ రెండు ప‌నులు అస్స‌లు చేయ‌కూడ‌దు.

8. నిద్రించేట‌ప్పుడు త‌ల కింద క‌చ్చితంగా దిండు పెట్టుకోవాలి. అయితే అది సాధార‌ణం క‌న్నా కొంచెం ఎక్కువ ఎత్తు ఉంటే మంచిది. దీంతో గురక రాదు. అలాగే ఎప్పుడూ వెల్ల‌కిలా ప‌డుకోకూడ‌దు. దీంతో గొంతులో ఎయిర్ బ్లాక్ అయి గుర‌క వ‌స్తుంది. కనుక ఒక‌ ప‌క్క‌కు తిరిగి ప‌డుకుంటే గుర‌క రాదు.

9. ఒక గ్లాస్ వేడి పాల‌లో కొద్దిగా ప‌సుపు వేసి క‌లుపుకుని నిద్రించే ముందు తాగాలి. దీంతో గుర‌క రాదు.

10. క్లారిఫైడ్ బ‌ట‌ర్ లేదా బ్రాహ్మి ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని వేడి చేయాలి. అందులోంచి రెండు చుక్క‌ల‌ను తీసి నిద్రించ‌డానికి ముందు ముక్కు రంధ్రాల్లో వేయాలి. ఇలా రోజూ చేస్తుంటే గుర‌క స‌మ‌స్య పోతుంది.

11. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర టేబుల్ స్పూన్ యాల‌కుల పొడిని వేసి బాగా కలిపి నిద్రించ‌డానికి ముందు తాగాలి. దీని వ‌ల్ల కూడా గుర‌క స‌మ‌స్య‌ను పోగొట్టుకోవ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM