సాధారణంగా పైనాపిల్ ఒక తినే పండుగా మాత్రమే భావించబడుతోంది. పైనాపిల్ తో కూర వండుకుని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పైనాపిల్ ను వేడి వేడి అన్నంలోకి తింటే ఆ రుచి చెప్పలేనిది. మరి ఎంతో రుచి కరమైన ఈ పైనాపిల్ కూరను ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*పైనాపిల్ ఒకటి
* కొబ్బరి పొడి 1 కప్పు
* ఆవాలు టేబుల్ స్పూన్
*బెల్లం 2 స్పూన్లు
*తగినంత ఉప్పు
*4 ఎండుమిర్చి
*కరివేపాకు రెమ్మ
*తగినన్ని నీళ్లు
*మూడు టేబుల్ స్పూన్ల నూనె
తయారీ విధానం
ముందుగాపైనాపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు, ఆ ఎండుమిర్చి,బెల్లం వేసి తగినన్ని నీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న పైనాపిల్ ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి. స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి మూడు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, కరివేపాకు, అవసరమైతే జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు చిటపట అన్న తర్వాత ఈ పోపును తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పైనాపిల్ మిశ్రమంలోకి వేయాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పైనాపిల్ కూరను వేడి వేడి అన్నంలోకి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.