వర్షాకాలంలో చల్ల చల్లని వాతావరణంలో ఎవరికైనా వేడివేడిగా కారం కారంగా తినాలనిపిస్తుంది. ఈ విధంగా చల్లని వాతావరణంలో వేడి వేడిగా నోరూరించే చిక్కుడు గారెలు తయారు చేసుకుని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరింకెందుకాలస్యం చిక్కుడు గారెలు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
*ఒక కప్పు చిక్కుడు గింజలు
*అల్లం చిన్న ముక్క
*పచ్చి మిరపకాయలు 10
*ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
*పుదీనా కొద్దిగా
*పచ్చి కరివేపాకు
*కొత్తిమీర గుప్పెడు
*ఉప్పు తగినంత
*బేకింగ్ సోడా చిటికెడు
*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత
*బియ్యంపిండి మూడు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
పచ్చి చిక్కుడుగింజల, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమంలోకి పుదీనా, కరివేపాకు, కొత్తిమిర, బియ్యపు పిండి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోకి చిటికెడు బేకింగ్ సోడా వేసి మిశ్రమం మొత్తం బాగా కలిసేలా తయారు చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని గారెలుగా వేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చి తీసేయాలి. ఈ విధంగా వేడి వేడిగా ఉండే చిక్కుడు గారెలను టమోటో చట్నీ, లేదా టమోటో కెచప్ తో తింటే అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి.