Ragi Dosa : రాగులలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో మూడు సార్లు రాగులను ఆహారంలో బాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రాగి పిండితో దోశ వేసుకొని తినవచ్చు. రాగి దోశ ఎలా తయారుచేయాలో చూద్దాం. ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బియ్యం పిండి, అరకప్పు బొంబాయి రవ్వ వేయాలి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి, అంగుళం అల్లం ముక్కను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, కొత్తిమీర, అరకప్పు పెరుగు, సరిపడా నీటిని పోసి దోశల పిండి మాదిరిగా కలుపుకోవాలి.
దోశ పిండిలా కలిపిన తరువాత పిండిని అరగంట పాటు అలా వదిలేయాలి. తరువాత పెనంపై దోశలు వేసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన రాగి దోశలు రెడీ అవుతాయి. వీటిని వారంలో రెండు మూడు సార్లు తినవచ్చు. ఓపిక ఉంది అనుకుంటే రోజూ వీటినే బ్రేక్ ఫాస్ట్ లా తినవచ్చు. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య నుండి బయట పడేస్తాయి. అలాగే కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా చాలా మేలు చేస్తాయి.
ఈ దోశలను తినడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ ఉండదు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రావు. ఇలా రాగి పిండితో దోశలను వేసుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. ఇక మనకు మార్కెట్‌లో రాగి పిండి లభిస్తుంది. లేదా రాగులను కొని శుభ్రం చేసి మనమైనా వాటిని పిండిలా పట్టించుకోవచ్చు. ఇలా రాగి దోశలు మాత్రమే కాకుండా రాగి జావ, రాగి రొట్టె వంటివి కూడా చేసుకుని తినవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…