Chiranjeevi : హీరోగా మెగాస్టార్ చిరంజీవి దాదాపు 150కి పైగా సినిమాలను చేశారు. వాటిలో ఎన్నో హిట్స్, మరికొన్ని సినిమాలు డిజాస్టర్ హిట్స్, కొన్ని సినిమాలు ఫ్లాప్, కొన్ని ఇండస్ట్రీ హిట్ సాధించాయి. ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయి ఆగిపోగా.. మరికొన్ని సినిమాలను రకరకాల కారణాలతో ఆయనే వదులుకున్నారు. ఇప్పటివరకు చిరంజీవి ఎనిమిది సినిమాలను వదులుకున్నారు. వాటిలో ఒక్క సినిమా మాత్రమే ఫ్లాప్ అయ్యింది. ఒక సినిమా సెట్స్ మీద ఉంది. మిగతా సినిమాలన్నీ హిట్. ఇప్పుడు అవి ఏమిటో తెలుసుకుందాం.
మొదటగా మన్నెంలో మొనగాడు సినిమాను చిరంజీవి వదులుకున్నారు. దర్శకుడు కోడి రామకృష్ణ ఈ సినిమాను చిరంజీవితో చేయాలనుకున్నాడు. కానీ అప్పటికే చిరంజీవికి స్టార్ హీరో ఇమేజ్ రావడంతో ఆ పాత్ర తనకు సూట్ అవ్వదని రిజెక్ట్ చేశాడు. అది యాక్షన్ కింగ్ అర్జున్ చేతికి వెళ్లి సూపర్ హిట్ అయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి -శ్రీదేవిల క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమాను వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మిద్దామని అనుకున్నారు. శ్రీదేవి పాత్ర ఎక్కువగా ఉండడంతోపాటు తను కూడా పుల్ బిజీగా ఉండడంతో ఆ సినిమా వదులుకున్నారు చిరు. తరువాత అది నాగార్జున చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు.
అసెంబ్లీ రౌడీ సినిమాని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేద్దామనుకున్నారు. పరుచూరి బ్రదర్స్ కూడా చిరంజీవిని నటింపజేయాలని అనుకున్నారు. కానీ రాజకీయ నేపథ్యం ఉన్నదనో, లేక తన డేట్స్ ఖాళీగా లేకనో చిరంజీవి ఈ ఆఫర్‌ని తిరస్కరించాడు. ఆ తరువాత అది మోహన్ బాబుని వరించి ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది. ఎస్వీ కృష్ణారెడ్డి నంబర్ వన్ టైటిల్ తో మూవీని చిరంజీవితో చేద్దామనుకున్నారు. అయితే అప్పటికే కృష్ణారెడ్డి అన్నీ చిన్న సినిమాలు చేసి ఉండడంతో ఆయనపై నమ్మకం లేక ఈ సినిమాను చిరంజీవి రిజెక్ట్ చేశారు. ఇక ఆ సినిమా కృష్ణ కెరీర్ ని మలుపు తిప్పి సూపర్ హిట్ అయింది.
జగదేక వీరుడు అతిలోక సుందరి అంత భారీగా సాహసవీరుడు సాగర కన్య సినిమాని చిరంజీవి-మాధురి దీక్షిత్‌లతో చేయాలనుకున్నారు కే రాఘవేందర్‌రావు. అయితే వరుస సినిమాలు పరాజయం పాలవ్వడంతో ఈ రిస్కీ ప్రాజెక్ట్‌ని అటెంప్ట్ చేయడానికి చిరంజీవి ఇష్టపడలేదు. దీంతో ఈ సినిమాను వెంకటేష్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. మెగాస్టార్ చిరంజీవి కోసమే దర్శకుడు పూరీ జగన్నాథ్ రాసుకున్న స్క్రిప్ట్ ఆంధ్రావాలా. కానీ ఈ స్క్రిప్ట్ నచ్చక మెగాస్టార్ దీనిని రిజెక్ట్ చేశారు. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. చిరంజీవి అనుకున్నట్టే ఈ సినిమా ఫ్లాప్ అయింది.
కన్నడలో ఆప్తమిత్రుడు చూశాక అది తెలుగులో చిరంజీవికి సూట్ అవుతుందని దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య చిరుని చంద్రముఖి కోసం అడిగారు. ఈ సినిమాని తరువాత చేద్దామని చిరు దాటవేశారు. ఇక ఆ తరువాత ఆ సినిమా రజినీకాంత్‌తో రూపొంది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రవితేజ హీరోగా సెట్స్ పై ఉన్న భారీ పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. తొలుత ఈ సినిమా కోసం చిరంజీవిని సంప్రదించారు. కానీ అందుకు చిరంజీవి ఒప్పుకోలేదు. దీంతో ఈ మూవీ రవితేజ చేతిలోకి వెళ్లింది. అయితే ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…