అతను ఒక క్రైస్తవుడు.. అయినప్పటికీ హిందూ దేవుడైన గణపతికి ఆలయం కట్టాలని భావించాడు. ఈ క్రమంలోనే ఏకంగా రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసే గణపతి ఆలయాన్ని నిర్మించాలని భావించాడు. మతాలు వేరైనా భగవంతుడు ఒక్కడేనని చాటి చెబుతున్న ఈ ఘటన కర్ణాటక, ఉడిపి జిల్లా శిర్వాలో చోటుచేసుకుంది.
గాబ్రియేల్ ఎఫ్ నజరేత్ అనే వ్యాపారి పదవ తరగతి పూర్తి చేసి ఆ తర్వాత ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో తిరిగి చివరికి ముంబైలో వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తన వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో తన సొంత ఊరిలో వినాయకుడి ఆలయం నిర్మించాలని భావించాడు.
బ్లాక్స్, మౌల్డ్స్ తయారీ సంస్థను ఏర్పాటు చేసిన గాబ్రియేల్ ఏసుప్రభుతో పాటు వినాయకుడిని కూడా ఎంతో నమ్మేవాడు. ఈ క్రమంలోనే తన సొంతూరిలో అమ్మాని రామన్న శెట్టి మెమోరియల్ హాల్‌లోని గణపతి ఆలయమంటే తనకెంతో ఇష్టమని అచ్చం ఆలయం తరహాలోనే మరొక ఆలయం నిర్మించాలని భావించినట్లు గాబ్రియెల్ స్నేహితుడు పుండలిక తెలిపారు. ఈ క్రమంలోనే ఈ ఆలయంలో ముప్పై ఆరు ఇంచుల వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఈ ఆలయంలో స్వామివారికి పూజలు చేయడానికి ప్రత్యేక పూజారినీ నియమించి అతనికి వసతి కల్పించడానికి మరొక ఇంటిని కూడా నిర్మించారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆలయ నిర్మాణం వాయిదా పడినప్పటికీ గత వారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, బ్రహ్మ కలశోత్సవం నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలను ముగ్గురు సభ్యులు కమిటీ నిర్వహించనుంది. ఈ విధంగా ఒక క్రైస్తవుడు వినాయకుడి ఆలయం నిర్మిస్తున్న విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…